రియల్ హీరో.. అభిమానికి ఆటో కొనిచ్చిన గోపీచంద్


సినిమా హీరోలంటే చాలామందికి పిచ్చి అభిమానం ఉంటుంది. వాళ్ల సినిమాలు ప్రదర్శించే థియేటర్ల ముందు కటౌట్లు కట్టడం, పాలాభిషేకాలు చేయడం దగ్గర్నుంచి.. పుట్టినరోజులకు కేకులు కట్ చేయడం, రక్తదానాలు చేయడం చూస్తూనే ఉంటాం. అలాగే తమ అభిమానులు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే హీరోలు ఆదుకుంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంటారు. ఈ కోవలోనే హీరో మానవత్వం చాటుకున్నారు. తన అభిమాని కష్టాల్లో ఉన్నాడని తెలుసుకుని రూ.2లక్షల ఆర్థిక సాయం చేసిన వార్త ఇప్పుడు ఫిల్మ్‌నగర్లో చక్కర్లు కొడుతోంది.
కరీంనగర్‌కు ఓ యువకుడు గోపీచంద్‌కు వీరాభిమాని. ఇటీవల అతడికి కరోనా సోకడంతో వైద్యం కోసం భారీగా ఖర్చుచేసి అప్పుల్లో కూరుకుపోయాడు. ఈ విషయం గోపీచంద్‌కు తెలియడంతో వెంటనే రూ.2లక్షల చెక్ పంపించారట. తన అభిమాన హీరో చేసిన ఆర్థిక సాయంతో అతడు ఆటో కొనుక్కుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఈ సాయంపై గోపీచంద్, ఆయన టీమ్ గుట్టుగా ఉంచినా... సాయం పొందిన వ్యక్తి అందరికీ చెప్పడంతో ఈ విషయం బయటికి వచ్చింది. గోరంత సాయం చేసి కొండంత ప్రచారం చేసుకునే వ్యక్తులున్న ఈ కాలంలో గోపీచంద్ చేసిన ఈ పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. Also Read:By December 07, 2020 at 07:29AM
No comments