అభిమానికి దిమ్మతిరిగే పంచ్.. సుమక్కతో మామూలుగా ఉండదు మరి
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
![](https://telugu.samayam.com/photo/79618539/photo-79618539.jpg)
యాంకరింగ్ ద్వారా లక్షల ఆదాయం సంపాదించే సుమ కనకాల.. ఓ అభిమానిని వెయ్యి రూపాయలు అడిగారట. ఈ వార్త నిజమేనా అని ఆలోచిస్తున్నారా. అవును నిజమే. బుల్లితెరపై స్టార్ హోదా అనుభవిస్తున్న సుమ ఎంత చలాకీగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఫ్యాన్స్‌ని అలరించేందుకు ఆమె అప్పుడప్పుడు సోషల్‌మీడియాలో లైవ్ ఇస్తుంటారు. ఈ క్రమంలోనే సుమ ఓ అభిమానిని వెయ్యి రూపాయలు అడిగింది. అయితే దాని వెనుక ఓ ఆసక్తికరమైన కథ కూడా ఉంది. Also Read: వరుస షోలతో బిజీగా ఉండే సుమ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది. అందులో వంటల కార్యక్రమాలతో పాటు సెలబ్రెటీలను ఇంటర్వ్యూలు చేస్తోంది. ఇందులో వచ్చే కార్యక్రమాలను నెటిజన్లు ఆకట్టుకోవడంతో అప్పుడే 1 మిలియన్ సబ్‌స్క్రై్బర్స్‌కు దగ్గరైంది. లైవ్‌లో మాట్లాడుతున్న సమయంలో సుమ నెటిజన్లు పెట్టే కామెంట్లను చదివి వాటికి సమాధానమిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ కామెంట్‌కు సుమ స్పందించకపోవడంతో అతడు అతితెలివి ప్రదర్శించాడు.
చూడండి సుమ గారూ.. మీరు నా కామెంట్‌కు రిప్లై ఇవ్వరు. దీనికోసం రూ.1000 పందెం అంటూ పోస్ట్ చేశాడు. దీంతో వెంటనే స్పందించిన సుమ.. అతడికి రిప్లై్‌తో పాటు షాకిచ్చింది. నా అకౌంట్ నంబర్ పంపిస్తున్నా... వెయ్యి రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేసెయ్.. అంటూ సమాధానమిచ్చింది. దీంతో సుమక్కతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చాలామంది నెటిజన్లు అతడికి సలహాలు ఇస్తున్నారు. Also Read:By December 08, 2020 at 09:56AM
No comments