Bharat Bandh: దీదీ అనూహ్య నిర్ణయం.. విపక్షాలకు షాక్!
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పిలుపు మేరకు నేడు అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ బంద్‌కు కాంగ్రెస్, శివసేన, లెఫ్ట్ పార్టీలు, టీఆర్ఎస్ తదితర పార్టీలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. దీంతో దేశవ్యాప్తంగా రవాణా పూర్తిగా స్తంభించగా.. బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కానీ మోదీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించే బెంగాల్ సీఎం మాత్రం బంద్‌కు దూరంగా ఉండటం గమనార్హం. తృణమూల్ కాంగ్రెస్ భారత్ బంద్‌కు మద్దతు పలకకపోవడంతో.. ప్రతిపక్షంలో చీలిక వచ్చినట్లయ్యింది. పార్లమెంట్‌లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గళం విప్పిన తృణమూల్ కాంగ్రెస్.. బంద్‌కు మాత్రం ఒప్పుకోలేదు. రైతు ఆందోళనలకు మద్దతు ప్రకటిస్తూనే.. భారత్ బంద్‌ను సమర్థించబోమని టీఎంసీ స్పష్టం చేసింది. ఇది తమ విధానాలకు విరుద్ధమని టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ స్పష్టం చేశారు. రైతుల జీవితాల గురించి.. వారి జీవనోపాధి గురించి తామెంతో ఆందోళన చెందుతున్నామని.. కేంద్రం రైతు వ్యతిరేక బిల్లులను వెనక్కి తీసుకోవాలని మమతా బెనర్జీ ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు. కేంద్రం తక్షణమే వెనక్కి తగ్గకపోతే రాష్ట్రవ్యాప్తంగా, దేశమంతటా ఆందోళనలు చేపడతామని ఆమె హెచ్చరించారు. ఆరంభం నుంచి తాము వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.
By December 08, 2020 at 10:29AM
No comments