పట్టపగలు.. నడిరోడ్డుపై యంగ్ హీరో సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లిన దొంగలు
సినిమాల్లో హీరోలు దొంగలను వెంటపడి పట్టుకుని చితకబాదేస్తుంటారు. కానీ నిజ జీవితంలో మాత్రం అలాంటి ఘటనలు ఊహించలేం. హీరోలైనా సరే వారికి నిజ జీవితంలో దొంగలు ఎదురుపడితే వారు సినిమాల్లోలాగ రెచ్చిపోకపోవచ్చు. వారి చేతిలో దోపిడీకి గురై నష్టపోవచ్చు. ఇలాంటి పరిస్థితే ఓ యంగ్ హీరోకి ఎదురైంది. అభినందన, అన్వేషణ.. లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో కార్తీక్. ఆయన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు. మణిరత్నం రూపొందించిన ‘కడలి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం ‘నవరస’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ నెల 2న చెన్నైలోని టీటీకే రాడ్‌లో సైకిల్ మీద వెళ్తున్న గౌతమ్‌ని ఇద్దరు వ్యక్తులు వచ్చి అడ్డగించారు. అతడిని బెదిరించి విలువైన సామ్‌సంగ్ ఫోన్‌ని ఎత్తుకెళ్లారు. పగటి సమయంలో అది కూడా రద్దీగా ఉండే రోడ్డులో సినిమా హీరోని దోపిడీ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చివరికి శరత్ అనే వ్యక్తితో పాటు ఓ మైనర్ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు దొంగిలించిన ఫోన్‌ను కొనుగోలు చేసిన ఫరూజ్ ఖాన్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
By December 19, 2020 at 07:54AM
No comments