Breaking News

చిరంజీవితో ఛాన్స్ వదులుకున్నా.. సినిమాల కంటే అదే నాకు ముఖ్యం: విజయశాంతి


తెలుగు తెరపై మెరిసిన హీరోయిన్లలో క్రేజే వేరు. తొలినాళ్లలో గ్లామరస్ హీరోయిన్‌గా అందాలు ఆరబోసిన ఆమె ఆ తర్వాత యాక్షన్ సినిమాల్లో సైతం దుమ్మురేపింది. ‘కర్తవ్యం’ సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకున్న ఆమెను అభిమానులు లేడీ అమితాబ్‌ అని పిలిచేవారు. 2006లో ‘నాయుడమ్మ’ తర్వాత పూర్తిగా దూరమైన విజయశాంతి రాజకీయాల్లో బిజీగా మారిపోయారు. మహేశ్‌బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ద్వారా 14ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. Also Read: ఆ సినిమాలో విజయశాంతి పాత్రకు మంచి పేరు రావడంతో వరుస అవకాశాలు తలుపు తట్టాయి. చాలామంది దర్శక నిర్మాతలు తమ సినిమాల్లో నటించాలని ఆమెను కోరగా సున్నితంగా తిరస్కరించారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ సినిమాలో ఆమె నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు రాములమ్మ. ప్రస్తుతం తాను రాజకీయాల్లో బిజీగా ఉన్నానని, మళ్లీ సినిమాల్లో నటిస్తానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని విజయశాంతి తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆఫర్ వచ్చిన మాట నిజమేనని, అయితే తాను ఆ సినిమాలో నటించనని చెప్పేశానన్నారు. తనకు ఇప్పుడు సినిమాల కంటే రాజకీయాలే ముఖ్యమని అన్నారు. ప్రజాసేవలో ఉండటమే తనకు ఇష్టమన్నారు. ఈ వ్యాఖ్యలతో కొంతకాలంగా తనపై వస్తున్న రూమర్లకు విజయశాంతి చెక్ పెట్టేశారు. ఇటీవలే ఆమె కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.


By December 18, 2020 at 10:34PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/vijayashanti-gives-clarity-about-movie-offers/articleshow/79802018.cms

No comments