Breaking News

ఏఎన్నార్ విలన్‌గా ఎందుకు నటించలేదో తెలుసా?


హీరోలుగా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న హీరోల్లో చాలామంది విలన్‌ పాత్రల్లో కూడా మెరిశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా మొదట్లో విలన్‌ పాత్రలు వేసి ఆ తర్వాత హీరో అయ్యారు. ఎన్టీఆర్, కాంతారావు, జగ్గయ్య, కృష్ణ, కృష్ణంరాజు, మోహన్‌బాబు లాంటి ఎందరో నటులు హీరోలుగానే కాకుండా విలన్లుగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే అగ్రహీరోగా తెలుగు సినీ పరిశ్రమను ఏలిన మాత్రం కెరీర్లో ఎప్పుడూ విలన్‌గా నటించలేదు. అలా ఎందుకు జరిగిందో ఓ సందర్భంలో ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘నా పర్సనాలిటీ(రూపం), కంఠం దుష్టపాత్రలకి సరిపోవు. ప్రేక్షకులు నన్ను విలన్‌గా అంగీకరించరనిపించింది. అందుకే ఎప్పుడూ విలన్ పాత్ర పోషించలేదు’ అని నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. 1940లో ‘ధర్మపత్ని’ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన అక్కినేని నాగేశ్వరరావు సుమారు 250 సినిమాల్లో నటించారు. 2014లో వచ్చిన ‘మనం’ ఆయన ఆఖరి సినిమా.


By December 05, 2020 at 02:07PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/the-reason-why-akkineni-nageswara-rao-never-acted-as-villain/articleshow/79579040.cms

No comments