కొవాగ్జిన్ టీకా ప్రయోగాల్లో పాల్గొన్న హరియాణా మంత్రికి కరోనా పాజిటివ్
కొవాగ్జిన్ టీకా ప్రయోగాల్లో పాల్గొన్న హరియాణా హోం మంత్రి అనిల్ విజ్‌కు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా శనివారం వెల్లడించారు. ప్రస్తుతం తాను అంబాలాలోని సివిల్ హాస్పిటల్‌లో చేరినట్టు తెలిపారు. కొవాగ్జిన్ టీకా తొలి డోస్ వేయించుకున్న రెండు వారాలకే ఆయనకు వైరస్ నిర్ధారణ కావడం గమనార్హం. తనను కలిసి ప్రతి ఒక్కళ్లూ పరీక్షలు చేయించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, టీకా వేయించుకున్న హరియాణా హోం మంత్రికి కరోనా వైరస్ సోకడంపై కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. Read Also: ‘టీకా రెండో మోతాదు తీసుకుని నిర్దిష్ట రోజులు గడిచిన తరువాత మాత్రమే కరోనా వైరస్‌ను నిరోధించే యాంటీబాడీలు ఏర్పడతాయి, ఎందుకంటే ఇది రెండు మోతాదుల టీకా.. టీకా వేసుకున్న తర్వాత అనిల్ విజ్2కు కోవిడ్ నిర్ధారణ కావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని.. ఆయన ఒక డోస్ మాత్రమే తీసుకున్నారు’ అని ఓ ప్రకటనలో తెలిపింది. Read Also: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ దేశవ్యాప్తంగా నవంబరు 20న ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తొలి డోసును మంత్రి నవంబరు 20న తీసుకున్నారు. అంబాలాలోని కోవిడ్ ఆసుపత్రిలో ఆయన కోవిడ్ టీకాను వేయించుకున్నారు. హరియాణాలోని కొవాగ్జిన్ ట్రయల్స్‌లో మొదటి వాలంటీర్‌గా ఆయన టీకాను తీసుకున్నారు. కొవాగ్జిన్ మూడో దశ ప్రయోగాలకు.. తొలి వాలంటీర్‌గా తాను స్వచ్ఛందంగా ముందుకొచ్చినట్లు మంత్రి అనిల్ విజ్ ప్రకటించిన విషయం తెలిసిందే. Read Also: ట్రయల్స్‌లో భాగంగా వాలంటీర్లకు మొదట ఓ ఇంజెక్షన్ ఇస్తారు. అనంతరం కొన్ని రోజుల విరామం తర్వాత మరో ఇంజెక్షన్ ఇస్తారు. ఈ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్లను 28 రోజుల తేడాతో ఇస్తున్నట్టు భారత్ బయోటెక్ వెల్లడించింది. ఇదిలా ఉండగా.. రైతులపై కేసులను ఉపసంహరించుకోవాలని కోరుతూ జననాయక్ జనతా పార్టీకి చెందిన ముగ్గురు ప్రతినిధులు హోం మంత్రి అనిల్ విజ్‌ను శుక్రవారం కలిశారు. హోం మంత్రి కలిసినవారిలో యోగా గురు రాందేవ్ బాబా కూడా ఉన్నారు.
By December 05, 2020 at 01:24PM
No comments