Breaking News

వాళ్లు ఫోన్ చేసి నా పిల్లల గురించి అలా మాట్లాడుతుంటే..! లైవ్‌లో కన్నీరు పెట్టుకున్న రేణు దేశాయ్


పవన్ కళ్యాణ్ మాజీ భార్య, రచయిత, సినీ నటి తన పిల్లలు , గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. తాజాగా సుమ హోస్టింగ్ చేస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొని తన పిల్లలిద్దరి గురించి చెబుతూ కన్నీరు పెట్టుకుంది. పవన్‌తో విడాకుల అనంతరం ఆద్య, అకీరాలను తన వద్దే ఉంచుకొని వారి ఆలనాపాలనా చూసుకుంటూ వారి వారి భవిష్యత్ ప్రణాళికలో కీలక భూమిక పోషిస్తోంది రేణు దేశాయ్. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్‌తో స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేసి ఆమె బర్త్ డే కానుకగా ప్రసారం చేసింది యాంకర్ సుమ. సొంతంగా సుమక్క పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన సుమ.. సెలబ్రిటీలను గెస్టులుగా పిలిచి వారితో వంట కార్యక్రమాలు చేస్తూ తన మాటల తూటాలతో ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో రేణు దేశాయ్‌ని గెస్టుగా పిలవగా సుమతో సరదాగా మాట్లాడుతూనే ఆమెనే ఆటపట్టించింది రేణు. ఎంతో ఫన్ క్రియేట్ చేస్తూ సాగిపోయిన ఈ షోలో తన పిల్లలు ఆద్య, అకీరాల గురించి మాట్లాడిన రేణు దేశాయ్ కళ్లలో ఆనందబాష్పాలు కనిపించాయి. Also Read: 'బెస్ట్‌ మామ్‌ ఎవర్‌' అంటూ ఓ టీ కప్పుపై పిల్లలతో దిగిన ఫోటోను వేసి రేణుకి గిఫ్ట్‌గా ఇచ్చింది సుమ. దీంతో ఆద్య, అకీరాలే తనకు సర్వస్వం అని చెబుతూ ఎమోషనల్ అయింది రేణు దేశాయ్. తన పిల్లలిద్దరూ ఏదైనా ఫంక్షన్స్ లేదా పవన్ షూటింగ్స్‌కి వెళ్ళినప్పుడు అక్కడి డైరెక్టర్లు, నటీనటులు ఆ ఇద్దరినీ చూసి తనకు ఫోన్ చేసి వారి గురించి మాట్లాడేవారని చెప్పింది. మీ ఇద్దరు పిల్లలు చాలా చాలా చక్కగా ఉన్నారు, అందరితో కలసి పోతున్నారు అని చెప్పినప్పుడు ఒక తల్లిగా ఆ క్షణాలు తనకెంతో సంతోషం కలిగించేవని తెలిపింది రేణు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


By December 05, 2020 at 01:47PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/renu-desai-emotional-comments-on-anchor-suma-spcial-show/articleshow/79579622.cms

No comments