అమెరికా నుంచి వచ్చి కష్టాలు పడ్డా.. రూమ్ అద్దె చెల్లించడానికి కూడా డబ్బుల్లేవ్: అడివి శేష్
తెలుగులో టాలెంటెడ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అడివి శేష్. విభిన్నమైన కథలు ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ‘మేజర్’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రిలీజైన్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కెరీర్ తొలినాళ్లలో తాను పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. Also Read: ‘సినిమాలపై ఆసక్తితో అమెరికాలో మంచి ఉద్యోగాన్ని వదులుకున్నారు. ఇక్కడికి వచ్చిన వెంటనే తొందరపడి నా దగ్గరున్న డబ్బులతో సినిమాలు నిర్మించాను. అవన్నీ ఫ్లాపులు కావడంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాను. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటిస్తుండగా పవన్ కళ్యాణ్ నటించిన ‘పంజా’లో అవకాశం వచ్చింది. ఆ చిత్రం మంచి పేరు తీసుకురావడంతో మరిన్ని అవకాశాలు తలుపుతట్టాయి. Also Read: ఆ వెంటనే నిర్మాతగా ‘కిస్’ అనే సినిమా తీశాను. అదికూడా ఫ్లాపు కావడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. ఓ సమయంలో గది అద్దె కట్టడానికి కూడా డబ్బుల్లేక ఇబ్బంది పడ్డాను. వచ్చిన ప్రతి అవకాశాన్ని కాదనకుండా ఒప్పుకుని నటించారు. గూఢచారి సినిమా నాకు మంచి బ్రేక్ ఇచ్చింది’ అని చెప్పుకొచ్చారు అడివి శేష్. ప్రస్తుతం తాను నటించిన ‘మేజర్’ సినిమా చాలా బాగా వచ్చిందని, ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తుందని శేష్ తెలిపారు.
By December 18, 2020 at 09:24PM
No comments