దుమ్ము రేపుతున్న ‘ఆర్ఆర్ఆర్’ టీజర్.. యూట్యూబ్‌లో సరికొత్త రికార్డు
యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో మల్టీస్టారర్‌గా ఎస్.ఎస్. తెరకెక్కిస్తున్న చిత్రం ‘’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఏ అప్‌డేట్ వచ్చినా దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లో కూడా భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే విడుదల చేసిన రెండు టీజర్‌లు యూట్యూబ్‌లో విశేష ఆదరణ పొందాయి. Also Read: దసరా సందర్భంగా విడుదల చేసిన ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ యూట్యూబ్‌లో సంచలనాలు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ వీడియో మరో అరుదైన రికార్డు సాధించింది. అక్టోబర్ 22న విడుదలైన ఈ టీజర్ ఇప్పటివరకు 5 లక్షలకు పైగా కామెంట్లను దక్కించుకుంది. ఇంత భారీస్థాయిలో కామెంట్లు దక్కించుకున్న తొలి తెలుగు టీజర్‌గా రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు 3.5 కోట్లకు పైగా వ్యూస్ దక్కించుకోవడంతో పాటు 12 లక్షల లైకులు సాధించి తిరుగులేని రికార్డు తన ఖాతాలో వేసుకుంది. టీజర్లే ఈ రేంజ్‌లో దుమ్ము రేపుతుంటే ‘ఆర్ఆర్ఆర్’ ఎన్ని రికార్డులు నెలకొల్పుతుందో చూడాలి మరి.
By December 19, 2020 at 08:24AM
No comments