Breaking News

బుల్లితెర నటిపై అత్యాచారం.. యువ దర్శకుడిపై కేసు


వివాహం చేసుకుంటానని నమ్మబలికి.. అవసరం తీరిపోయిన తర్వాత ముఖం చాటేశాడో ప్రబుద్ధుడు. పెళ్లి పేరెత్తితే దాటవేయడంతో చివరకు మోసపోయినట్టు గ్రహించింది. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు బుల్లితెర నటి కాగా.. ఆమె ఓ దర్శకుడి చేతిలో మోసపోయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నటిపై అత్యాచారం చేసిన ఓ దర్శకుడిపై ముంబయిలోని వెర్సోవా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయికి చెందిన టీవీ నటికి, దర్శకుడికి గత రెండేళ్లుగా పరిచయం ఉంది. ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకుంటానని ఆ దర్శకుడు నమ్మించాడు. ఇది నిజమేనని భావించిన బాధితురాలు అతడికి దగ్గరయ్యింది. దీన్ని ఆసరగా తీసుకున్న నిందితుడు చాలా సార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. పెళ్లి ప్రస్తావన గురించి నటి తీసుకురాగా తప్పించుకుంటున్నాడు. పెళ్లి విషయమై గత కొద్ది రోజులుగా ఇరువురి మధ్య చర్చ జరుగుతోంది. బాధిత నటి అతడిని నిలదీయగా దాటవేస్తూ వచ్చాడు. దీంతో మోసపోయినట్లు గ్రహించి నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌ 376 ప్రకారం అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదని వెర్సోవా పోలీసు అధికారి రాఘవేంద్ర ఠాకుర్ తెలిపారు. దర్యాప్తులో వాస్తవాలు వెల్లడవుతాయని తెలిపారు. క్యాస్టింగ్ డైరెక్టర్ (26), అతడి స్నేహితుడిపై కేసు పెట్టినట్టు సదరు నటి తెలిపింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనపై చాలాసార్లు అత్యాచారం చేశాడని, శారీరకంగా, మానసికంగా వేధించాడని పేర్కొంది. పోలీసులపై కూడా బాధితురాలు ఆరోపణలు గుప్పించింది. తాను నవంబరు 16న ఫిర్యాదు చేస్తే, నవంబరు 25 వరకు కేసు నమోదు చేయలేదని తెలిపింది. నిందితుడిని ఇప్పటి వరకూ అరెస్ట్ చేయలేదని, తాను ఎటువంటి వైద్య పరీక్షలకైనా సిద్ధమేనని స్పష్టం చేసింది.


By December 01, 2020 at 08:25AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/case-against-director-for-allegedly-raping-tv-actress-in-mumbai/articleshow/79502724.cms

No comments