నాది లవ్ ఫెయిల్యూర్.. కానీ డేటింగ్ చేయాలనుంది: రాశీ ఖన్నా
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మధ్యలో వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడినా.. వెంకీమామ, ప్రతిరోజు పండగే, వరల్డ్ ఫేమస్ లవర్.. చిత్రాలతో తిరిగి పుంజుకుంది. సోమవారం తన 30వ పుట్టినరోజు జరుపుకున్న రాశీ.. ఓ ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. తన ప్రేమ వైఫల్యం గురించి చెబుతూనే.. ఎవరితోనైనా డేటింగ్ చేయాలని ఉందంటూ షాకిచ్చింది.
‘ప్రేమ సక్సెస్ అవ్వడం అనేది అరుదుగా జరుగుతుందని, ప్రేమలో ఫెయిల్యూర్సే ఎక్కువని... అలాంట చేదు అనుభవం తనకూ ఉందని రాశీఖన్నా గతంలోనే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పింది. స్కూల్ డేస్‌లో తన సీనియర్‌తో ఆమె ప్రేమలో పడగా.. కొన్ని కారణాల వల్ల అది విఫలమైంది. పుట్టినరోజు నాడు ఆమెకు విషెస్ చెప్పిన నెటిజన్లు.. ఇప్పుడు ప్రేమలో ఉన్నారా? అంటూ కొంటెగా అడిగారు. Also Read: ‘ప్రస్తుతానికి నేను సింగిల్‌గానే ఉన్నా. ఇప్పటికైనా నా జీవితంలో ఎవరూ లేరు. నిజం చెప్పాలంటే ఎవరితోనైనా డేటింగ్ చేయాలని ఉంది. ఆ అనుభవం ఎలా ఉంటుందో ఆస్వాదించాలని ఉంది. కానీ ఎందుకో ఆ వైపు వెళ్లలేకపోతున్నా’ అని చెప్పుకొచ్చింది రాశీఖన్నా. ఈ అమ్మడి వరుస చూస్తుంటే త్వరలోనే ఎవరితోనో ప్రేమలో పడేలాగా కనిపిస్తోంది.By December 01, 2020 at 08:35AM
No comments