ట్రంప్ న్యాయపోరాాటానికి తెర.. ఎన్నికలపై పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఎన్నికల్లో మోసాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టుల్లో దావా వేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అక్కడా చుక్కెదురయ్యింది. ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ ట్రంప్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఎన్నికలపై ట్రంప్ న్యాయపోరాటానికి తెరపడినట్టయ్యింది. ట్రంప్ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. గత నాలుగేళ్లుగా సుప్రీంకోర్టు సమగ్రతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ, న్యాయమూర్తులను వివాదాల్లోకి నెట్టేందుకు ప్రయత్నించారని మండిపడింది. Read Also: ట్రంప్ వాదనలు చట్టం పరిమితులు దాటాయని, వ్యక్తిగతంగా న్యాయమూర్తుల నిష్పాక్షికతను పరీక్షించాయన్నారు. ఎన్నికలపై ట్రంప్ చేసిన ఆరోపణలను అర్ధరహితమని పేర్కొంటూ దావాను శుక్రవారం కొట్టివేసింది. ఎలక్టోరల్ కాలేజీ సమావేశానికి గడువు సమీపిస్తుండటంతో న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకుంది. ఈ సమావేశానికి మరో రెండు రోజులే గడువు ఉండగా.. సుప్రీంకోర్టు తీర్పుతో బైడెన్ ఎన్నిక లాంఛనం కానుంది. డిసెంబరు 14న ఎలక్టోరల్ కాలేజీ సమావేశమై అధ్యక్షుడిని ఎన్నుకోనుంది. Read Also: సుప్రీంకోర్టులోని ఆరుగురు న్యాయమూర్తుల్లో ముగ్గురు ట్రంప్ నియమించినవారే అయినా, న్యాయమూర్తులకు పక్షపాతం ఉండదని మరోసారి నిరూపించుకున్నారు. పెన్సిల్వేనియా, జార్జియా, మిచిగాన్, విస్కాన్సిన్ ఫలితాలను సవాల్ చేస్తూ దాఖలుచేసిన పిటిషన్‌పై రిపబ్లికన్ పార్టీకి చెందిన 18 మంది స్టేట్ అటార్నీ జనరల్, కాంగ్రెస్‌లోని 126 మంది రిపబ్లికన్ సభ్యుల బృందాన్ని సంతకం చేసేలా టెక్సాస్ అటార్నీ జనరల్ కెన్ పాక్స్‌టన్, ట్రంప్‌లు ఒప్పించారు. Read Also: టెక్సాస్, ఇతర రిపబ్లికన్ నేతృత్వంలోని రాష్ట్రాల అభ్యర్థనను న్యాయమూర్తులు తిరస్కరించకపోతే న్యాయవ్యవస్థ స్వతంత్రే ప్రశ్నార్ధకంగా మారేది. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన తీరుపై సుప్రీంకోర్టు సందేహాలు వ్యక్తం చేస్తోంది. ఆయన విధానాలు, వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలు కొన్ని వ్యాజ్యాలకు లోబడి ఉన్నాయి. Read Also:
By December 12, 2020 at 10:19AM
No comments