కొడుక్కి కరెంట్ షాకిచ్చిన తండ్రి.. అయినా వదలకుండా.. దారుణం
కన్నకొడుక్కి కరెంట్ షాకిచ్చి.. గడ్డపారతో పొడిచి చంపేశాడో కసాయి తండ్రి. మద్యానికి బానిసైన కొడుకు వేధింపులు భరించలేక ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. నిజాంపేట మండలం నస్కల్ గ్రామానికి చెందిన కుమ్మరి స్వామి(40) మద్యానికి బానిసయ్యాడు. పనీపాటా లేకుండా జులాయిగా తిరుగుతూ తాగొచ్చి వేధింపులకు గురిచేసేవాడు. భర్త వేధింపులు భరించలేక స్వామి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తల్లిదండ్రులతో ఉంటున్న స్వామి.. మద్యం మత్తులో నిత్యం గొడవపడేవాడు. కొడుకు వేధింపులు తాళలేకపోయిన తండ్రి బాలయ్య చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అదే గ్రామానికి చెందిన స్నేహితుడు రమేష్‌తో కలసి పథకం వేశాడు. కరెంట్ షాకిచ్చి కొడుకుని చంపాలని ప్రయత్నించినా అది వీలు కాలేదు. దీంతో గడ్డపలుగు, రాడ్డుతో విచక్షణా రహితంగా దాడి చేసి చంపేశారు. అయినా అనుమానం తీరని తండ్రి కరెంట్ షాకిచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో నేరం చేసినట్లు తండ్రి ఒప్పుకోవడంతో అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. Also Read:
By December 17, 2020 at 10:36AM
No comments