పాలేరుతో కలసి యజమాని భార్య ఘాతుకం.. కర్నూలులో దారుణం
కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. పాలేరుతో కలసి భార్య ఘాతుకానికి పాల్పడింది. భర్తను దారుణంగా అంతమొందించింది. అనంతరం ఏమీ ఎరగనట్టు హైడ్రామాకు తెరతీసింది. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు పాలేరుని అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించడంతో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. యజమాని భార్యతో వివాహేతర సంబంధం బయటపడింది. తమకు అడ్డుగా ఉన్నాడనే ప్రియుడితో భర్తను దారుణంగా హత్య చేయించినట్లు తేలింది. ఆళ్లగడ్డ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆళ్లగడ్డ మండలం బాచేపల్లికి చెందిన కృష్ణ కిషోర్(44), భాగ్యలక్ష్మి దంపతులు. ఇంట్లో పనిచేసే పాలేరు నరసింహుడుతో భాగ్యలక్ష్మి వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించేవాడు. అదే విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దానికితోడు కృష్ణ కిషోర్ గ్రామంలో భారీగా అప్పులు చేశాడు. నిత్యం భార్యను వేధించేవాడు. భరించలేకపోయిన భార్య అదనుచూసి తన భర్తను చంపేయాలని పాలేరు నరసింహుడికి చెప్పింది. ఈ నెల 3 వ తేదీన నరసింహుడు మద్యం తాగుదామని కృష్ణ కిషోర్‌ని నమ్మించి చాగలమర్రి మండలం నగల్లపాడు సమీపంలోని బనవాసి వాగు వద్దకు తీసుకెళ్లాడు. ఫుల్లుగా మద్యం తాగించి వాగులోకి తోసేశాడు. కృష్ణ కిషోర్ నీటమునిగి మృతి చెందాడు. అనంతరం అతని భార్య భాగ్యలక్ష్మి తనకేమీ తెలియనట్టు కొత్తడ్రామాకు తెరతీసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సమీప గ్రామంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకి పాలేరు నరసింహుడు అనుమానాస్పదంగా తిరగడం కనిపించింది. అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో భార్య డ్రామా బయటపడింది. పాలేరుతో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తని హత్య చేయించినట్లు తేలింది. పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. Also Read: Read Also:
By December 12, 2020 at 11:55AM
No comments