Breaking News

టీఎఫ్‌సీసీ పదవికి నట్టి కుమార్ రాజీనామా.. పెద్ద నిర్మాతలపై సంచలన ఆరోపణలు


తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌‌లో లుకలుకలు బయటపడ్డాయి. జాయింట్ సెక్రటరీగా ఉన్న తన పదవికి రాజీనామా చేశారు. అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌షిప్ కూడా వదులుకున్నారు. ఈ మేరకు డిసెంబర్ 7న ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు రాసిన లేఖను ఆయన శనివారం మీడియాకు విడుదల చేశారు. Also Read: థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినా కొంతమంది సినీ పెద్దలు అడ్డుకుంటున్నారని నట్టి కుమార్ ఆరోపించారు. థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో థియేటర్ల ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు, వాటిపై ఆధారపడ్డ కూలీలు ఎంతో సంతోషించారని, కానీ పరిశ్రమలోని కొంతమంది పెద్ద నిర్మాతల కారణంగా వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారని తెలిపారు. పెద్ద నిర్మాతలు తమ స్వప్రయోజనాల కోసం థియేటర్లను 2021 మార్చి వరకు మూసి ఉంచేలా చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రలన్నీ భరించలేకే తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు నట్టి కుమార్ లేఖలో పేర్కొన్నారు. ఈ చర్యలపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ నారాయణ దాసు, సెక్రటరీ దాములను ఆయన కోరారు.


By December 12, 2020 at 01:05PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/natty-kumar-resigns-telugu-film-chamber-of-commerce-joint-secretary/articleshow/79692890.cms

No comments