Breaking News

కృష్ణా జిల్లా: భార్యతో కలిసి అత్తమామల్ని చంపిన అల్లుడు.. కారణం తెలిసి పోలీసులే అవాక్కు


కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. అత్త,మామల్ని అల్లుడు, కూతురే కిరాతకంగా హత్య చేయడం సంచలనం రేపింది. మండలం బండి పాలెంకు చెందిన మనీషాను వాలంటీర్‌గా పనిచేస్తున్న బాబూరావు అలియాస్ నెమలి బాబు ప్రేమించాడు. నాలుగు నెలల క్రితం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి నెమలి బాబు మామ ముత్తయ్య, అత్త సుగుణమ్మను వేధిస్తున్నాడు. కట్నం ఇవ్వాలంటూ ఇద్దరిపై ఒత్తిడి తెచ్చాడు.. రోజూ వారితో గొడవ పడుతుండేవాడు. వేధింపులతో లాభం లేదనుకున్నాడో ఏమో.. నెమలి బాబు అత్తమామల్ని గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. భార్య మనీషా కూడా భర్తకు సహకరించింది. ఈ విషయం స్థానికులకు తెలియడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. రంగంలోకి దిగిన పోలీసులు భార్యభర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కట్నం కోసం నెమలి బాబు ఇంత దారుణానికి ఒడిగట్టడం.. అతడికి భార్య సహకరించడంతో స్థానికులు, పోలీసులు కూడా అవాక్కయ్యారు.


By December 16, 2020 at 07:53AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-kills-his-wife-parents-in-jaggayyapeta-krishna-district/articleshow/79750524.cms

No comments