ప్రణబ్ కుటుంబంలో చిచ్చురేపిన ‘ఆత్మకథ’..అన్నాచెల్లెళ్ల మధ్య వార్!
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన చివరి పుస్తకం ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ ఆయన కుటుంబంలో విభేదాలకు బాటలు వేసింది. ఆ పుస్తకాన్ని తన అనుమతి లేకుండా ప్రచురించరాదని ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ.. పుస్తకం విడుదలకు అనవసరమైన ఆటంకాలు సృష్టించవద్దని ఆయన సోదరి శర్మిష్ఠ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా పేరు పొందిన ప్రణబ్ ముఖర్జీ రాసిన ఈ పుస్తకంలో సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా మోదీ ప్రభుత్వ పాలనపై పలు విషయాలు ప్రస్తావించినట్టు ఇటీవల బయటకి వచ్చిన విషయం తెలిసింది. ‘2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి సోనియా, మన్మోహనే కారణం.. 2004లో తాను ప్రధాని అయ్యుంటే, పార్టీ అధికారం కోల్పోయేది కాదని కొందరు కాంగ్రెస్ నాయకులు అంటుండేవారు.. ఆ వ్యాఖ్యలతో తాను ఏకీభవించకపోయినా, తాను రాష్ట్రపతి అయిన తర్వాత కాంగ్రెస్ నాయకత్వం బలహీనపడిందని’ ప్రణబ్ వ్యాఖ్యానించారు. తాజాగా ఈ పుస్తకం అక్కాతమ్ముళ్ల మధ్య విభేదాలకు ఆజ్యం పోయడం చర్చనీయాంశంగా మారింది. తాను ఆ పుస్తకం తుది ప్రతుల్ని పూర్తిగా చదివిన తర్వాతే ప్రచురణకు అనుమతినిస్తానని అప్పటి వరకు విడుదలని నిలిపివేయాలని ప్రచురణ కర్తలకి చెప్పినట్టుగా కాంగ్రెస్ మాజీ ఎంపీ అభిజిత్ ముఖర్జీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘నేను‘ది ప్రెసిడెన్షియల్ మెమోరీస్’ రచయిత కుమారుడిని.. నా అనుమతి లేకుండా ఇప్పటికే కొన్ని మీడియాల్లో చక్కెర్లు కొడుతున్న అంశాల ప్రచురణతో పాటు ప్రేరేపిత విషయాలను దయచేసి ఆపమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను’ అని అన్నారు. ‘నా తండ్రి లేరు కాబట్టి, నేను అతని కొడుకు కావడం వల్ల పుస్తకం ప్రచురించడానికి ముందే చివరి కాపీలోని విషయాలను లుసుకోవాలనుకుంటున్నాను.. నా తండ్రి ఈ రోజు జీవించి ఉంటే, ఆయన కూడా అదే చేసి ఉండేవారు’ పేర్కొన్నారు. అభిజీత్ ట్వీట్ చేసిన రెండు గంటల తర్వాత ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠ తీవ్రంగా స్పందించారు. చీప్ పబ్లిసిటీ కోసం అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ అంటూ హితవు పలికారు. ‘’ అనే రచయిత కుమార్తె నేను.. మా తండ్రి రాసిన చివరి పుస్తకం ప్రచురణలో అనవసరమైన అడ్డంకులు సృష్టించవద్దని నా సోదరుడు అభిజీత్‌ను అభ్యర్థిస్తున్నాను. ఆయన అనారోగ్యానికి ముందే మాన్యుస్క్రిప్ట్ పూర్తి చేశారు’ అన్నారు. ‘ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు అతని సొంతం.. ఏ చౌకబారు ప్రచారం కోసం ప్రచురించకుండా ఆపడానికి ఎవరూ ప్రయత్నించరాదు. అలా చేస్తే ఈ లోకాన్ని వీడిన మా తండ్రికి ద్రోహం చేసినట్టు అవుతుంది.. తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే హక్కు ఆయనకుంది’ అని శర్మిష్ఠ అన్నారు. అంతేకాదు, పుస్తకం పేరు పేరు ‘ది ప్రెసిడెన్షియల్ మెమోరీస్’ కాదు.. ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ అంటూ గుర్తుచేశారు.
By December 16, 2020 at 08:16AM
No comments