Breaking News

మళ్లీ ప్రేమలో పడిన నటి వనిత వనితా విజయ్‌కుమార్.. నెటిజన్ల సెటైర్లు


ప్రేమించి పెళ్లి చేసుకోవడం కొన్నాళ్లకే విడిపోవడం వంటి ఘటనలు చాలామంది సెలబ్రెటీల జీవితాల్లో జరుగుతూనే ఉంటాయి. ఒకరికి వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకోవడం, ఇద్దరో ముగ్గురితో ప్రేమలో పడటం అన్నది కూడా కొందరి జీవితాల్లో జరుగుతుంటుంది. అయితే ఈ హీరోయిన్ మాత్రం ఏకంగా నలుగురితో ప్రేమాయణం నడిపి ముగ్గురిని పెళ్లి చేసుకుని వదిలేసింది. ఇప్పుడు ఐదో వ్యక్తితో ప్రేమలో పడిందట. ఆమె ఎవరో కాదు విజయ్ కుమార్-మంజుల దంపతుల కుమార్తె . తాను మరోసారి ప్రేమంలో పడినట్లు వనిత సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించడం ఇప్పడు హాట్‌ టాపిక్‌గా మారింది. ‘మళ్ళీ ప్రేమలో పడ్డాను. ఇప్పుడు మీరు హ్యాపీనా?’ అంటూ పోస్ట్ పెట్టింది వనిత. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే వనిత నిజంగానే ప్రేమలో పడిందా? లేక తనను విమర్శించే వాళ్లకు కౌంటర్‌గా పోస్ట్ చేసిందా? అన్నది తెలియాల్సి ఉంది. Also Read: 2000లో నటుడు ఆకాష్‌ను పెళ్లాడిన వనిత.. ముగ్గురు పిల్లలు పుట్టాక అతడికి విడాకులు ఇచ్చింది. 2007లో ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకుని ఐదేళ్లకు కాపురం చేసి విడిపోయింది. ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్ రాబర్ట్‌తో నాలుగేళ్ళు సహజీవనం చేసి 2017లో అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఈ ఏడాది లాక్‌డౌన్ సమయంలో పీటర్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది. అయితే పీటర్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా వనితను పెళ్లాడటం వివాదాస్పదమైంది. ఆ తర్వాత ఈ జంట హనీమూన్‌కి వెళ్లిన చోట గొడవ జరిగింది. దీంతో పీటర్ వనితను వదిలేసి మొదటి భార్య వద్దకు వెళ్లిపోయాడు. తాజాగా తాను మరోసారి ప్రేమలో పడినట్లు వనిత ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది.


By December 19, 2020 at 07:26AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-vanitha-vijay-kumar-fall-in-love-again/articleshow/79801697.cms

No comments