Breaking News

గతం: చిన్న సినిమాకు పెద్ద గుర్తింపు.. అంతర్జాతీయ చ‌ల‌న చిత్రోత్స‌వాల్లో అరుదైన అవకాశం


ఈ ఏడాది ఓటీటీ వేదికపై విడుదలైన '' మూవీకి అరుదైన అవకాశం దక్కింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో()లోని ఇండియన్ పనోరమా కేటగిరీలో ప్రదర్శితం కానున్న ఏకైక తెలుగు సినిమాగా ఈ మూవీ నిలిచింది. జనవరి 17న గోవాలో జరగనున్న ఫంక్షన్‌లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. గతేడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా కామెడీ నేపథ్యంలో వచ్చిన సినిమా 'ఎఫ్2' సినిమాకు ఈ అవకాశం రాగా, 2020కి గాను ఆ ఛాన్స్ 'గతం' కొట్టేసింది. ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఇండియన్ పనోరమా అనేది ఒక ప్రధాన భాగం. బెస్ట్ ఇండియన్ సినిమాలను ఇందులో ప్రదర్శిస్తుంటారు. ఉత్తమ భారతీయ సినిమాలను ప్రోత్సహించేందుకు గాను 1978లో దీనిని ప్రవేశపెట్టారు. ప్రతి సంవత్సరం ఉత్తమ భారతీయ సినిమాలను ఇందులో ప్రదర్శిస్తారు. ఇప్పుడు ఓ చిన్న సినిమా అయిన 'గతం'కు ఈ అవకాశం రావడం ఎంతో గొప్పదని చెప్పుకోవచ్చు. నవంబర్ 6న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన 'గతం' సూపర్ సక్సెస్ అయింది. థ్రిల్లర్ కథాంశంతో కిరణ్ కొండమడుగుల దీనిని తెరకెక్కించారు. భార్గవ పోలుదాసు, రాకేష్ గాలేభే, పూజిత కురపర్తి ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించగా.. భార్గవ పోలుదాసు, సృజన్ యర్రబోలు, హర్ష వర్ధన్ ప్రతాప్‌లు కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఇక శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా.. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు. సస్పెన్స్, ట్విస్టులతో సాగే ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.


By December 20, 2020 at 09:02AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/gatham-movie-nominated-to-show-in-iffi/articleshow/79820757.cms

No comments