Breaking News

Punarnavi Bhupalam: అదొక్కటి తప్పితే బిగ్ బాస్ వల్ల ఒరిగిందేమీ లేదు.. పునర్నవి షాకింగ్ కామెంట్స్


భూపాలం.. సీజన్ 3 ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. అప్పటిదాకా కొందరికే తెలిసిన ఆమె బిగ్ బాస్ పాల్గొన్నాక అందరికీ తెలిసిపోయింది. హౌస్‌లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో నడిపిన లవ్ ట్రాక్, రొమాన్స్ ఆ సీజన్‌లో హైలైట్ కావడమే గాక ఎక్కడ చూసినా పునర్నవి- రాహుల్ ప్రేమ సంగతులే వినిపించాయి. దీంతో మీడియాలో పునర్నవి పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటికు వచ్చాక కూడా అటు రాహుల్, ఇటు పునర్నవి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ గురించి పునర్నవి చేసిన కామెంట్స్ జనాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తన కెరీర్‌పై బిగ్ బాస్ పెద్దగా ప్రభావం చూపలేదని, ఈ షోకి వెళ్లడం ద్వారా తనకు అవకాశాల పరంగా పెద్ద తేడా కనిపించలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది పునర్నవి. ఈ షోతో జరిగిన ఒకే ఒక్క మంచి అంటే ఫ్యాన్స్‌కు మరింత దగ్గర కావడమే! అని ఆమె చెప్పింది. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అప్పుడెప్పుడో 'ఉయ్యాల జంపాల' సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన నీకు బిగ్ బాస్ ఇంత క్రేజ్ తెచ్చిపెడితే.. ఇప్పుడిలా మాట్లాడుతుందేంటనేది ఎవ్వరికీ అర్థం కావడంలేదు. ఏదేమైనా బిగ్ బాస్ సీజన్ 4 ముగుస్తున్న ఈ సమయంలో పునర్నవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పునర్నవి చేసిన కామెంట్స్‌ని కొందరు తప్పుబడుతుండగా.. ఇంకొందరు బిగ్ బాస్ వల్ల పునర్నవికే కాదు ఏ ఒక్క కంటిస్టెంట్‌కి గానీ, ప్రేక్షకులకు గానీ ఉపయోగం లేదంటూ ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం పునర్నవి నటించిన వెబ్ సిరీస్ ‘కమిట్‌మెంటల్’ ఆహా ఓటీటీలో అలరిస్తోంది. ఇకపోతే ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 4‌ నుంచి బయటికి వచ్చిన దివి, మోనాల్ గజ్జర్‌కు పలు ఆఫర్స్ తలుపు తడుతుండటం చూసి.. పునర్నవి బిగ్ బాస్ ఇచ్చిన క్రేజ్‌ని సరిగ్గా వాడుకోలేకే ఇలా మాట్లాడుతోందని అంటున్నారు జనం.


By December 20, 2020 at 08:37AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/punarnavi-bhupalam-shocking-comments-on-bigg-boss-show/articleshow/79820591.cms

No comments