సుమంత్ రిజెక్ట్ చేశాడు.. బన్నీ హిట్ కొట్టాడు
అల్లు అర్జున్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. బన్నీ హైపర్ యాక్టింగ్, పూరీ అద్భుతమైన టేకింగ్, హన్సిక అందాలు ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ కథలో తనను తప్ప ప్రేక్షకులు మరెవరినీ ఊహించుకోలేనంతగా నటనలో ఇరగదీశాడు. అయితే ఈ స్టోరీ ముందు హీరో వద్దకే వెళ్లిన విషయం చాలామందికి తెలియదు.
‘దేశముదురు’ స్టోరీని పూరీ జగన్నాథ్ ముందుగా సుమంత్‌కి వినిపించాడట. అయితే సన్యాసి అయిన హీరోయిన్‌ని ప్రేమలోకి దించాలని హీరో ప్రయత్నించే కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? అని సుమంత్ వెనకడుగు వేశాడట. దీంతో పూరీ ఆ కథను బన్నీకి చెప్పడం, ఆయన వెంటనే ఓకే చెప్పేయడం జరిగిపోయింది. సన్యాసిగా బ్రతుకుతున్న హీరోయిన్‌ని చూసి హీరో ప్రేమలో పడటం, ఆమెను ఎలాగైనా దక్కించుకునే చేసే సాహసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దర్శకుడిగా పూరీకి, హీరోగా అల్లు అర్జున్‌కు మరిచిపోలేని అనుభూతిని పంచింది. చక్రి స్వరపరచిన పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి.By December 16, 2020 at 12:06PM
No comments