Breaking News

పెళ్లి చేసుకుని భర్తతో ఇంటికి.. మరో భార్య ఉండడంతో.. చివరికి..


కోటి ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిన ఆమెకి ఊహించని షాక్ ఎదురైంది. ఆయనకి మరో భార్య ఉందని తెలియడంతో గుండెబద్దలైంది. పెళ్లయిన విషయం చెప్పకుండా మోసం చేసి తనను పెళ్లి చేసుకున్నాడని తెలిసి మనోవేదనకు గురైంది. మోసపోయానన్న బాధతో అఘాయిత్యానికి ఒడిగట్టింది. ఈ విషాద ఘటన జిల్లాలో జరిగింది. చింతపల్లి మండల కేంద్రంలోని రామాలయం వీధికి చెందిన సాయిలక్ష్మి(23)కి గూడెంకొత్తవీధి మండలం పెదవలస గ్రామానికి చెందిన బండి గణేష్‌తో వివాహమైంది. వివాహానంతరం అత్తారింట్లో అడుగుపెట్టిన సాయిలక్ష్మికి ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఆయనకి గతంలోనే మరొకరితో వివాహమైందని తెలియడంతో షాక్‌కి గురైంది. అదే విషయమై భర్తని నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. Also Read: పెళ్లైన విషయం దాచి మోసం చేసి తనను పెళ్లి చేసుకున్నాడని సాయిలక్ష్మి తీవ్రమనస్థాపానికి గురైంది. తరచూ గొడవలతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని దారుణ నిర్ణయం తీసుకుంది. తన అన్నకు ఫోన్ చేసి చనిపోతున్నానని చెప్పింది. మరుసటి రోజు అంతర్ల సమీపంలోని ఆలయం వెనుక విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Read Also:


By December 01, 2020 at 01:04PM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/married-woman-commits-suicide-over-husband-cheating-in-visakhapatnam/articleshow/79506905.cms

No comments