‘నీపై పగ తీర్చుకుంటా’... నితిన్‌కి వార్నింగ్ ఇచ్చిన కీర్తిసురేష్
‘మహానటి’ కీర్తి సురేష్ తెలుగులో వరుస సినిమాలతో బిజీగా మారింది. లాక్‌డౌన్ సమయంలో ఆమె నటించిన రెండు సినిమాలు ఓటీటీ ద్వారా రిలీజై తీవ్రంగా నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నితిన్‌తో ‘రంగ్‌దే’, మహేశ్‌బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. ‘రంగ్‌దే’ షూటింగ్ ప్రస్తుతం దుబాయిలో జరుగుతోంది. ఈ క్రమంలోనే సినిమా సెట్లో కీర్తి నిద్రపోతుండగా ఫోటో తీసిన .. దాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. షూటింగ్‌తో తమకు చెమటలు పడుతుంటే కీర్తి మాత్రం హ్యాపీగా రిలాక్స్ అవుతోందంటూ కామెంట్ చేశాడు. Also Read: ఈ సరదా ఫోటో సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీనిపై స్పందించిన కీర్తి ఆ ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘షూటింగ్ సెట్లో ఎప్పుడూ నిద్రపోకూడదని గుణపాఠం నేర్చుకున్నా. పగ తీర్చుకుంటా’ అని కామెంట్ చేసింది. దీంతో పాటు దుబాయిలోని అద్భుతమైన లొకేషన్లో దిగిన ఫోటోలను కూడా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. Also Read:
By December 01, 2020 at 12:15PM
No comments