ఏటీఎం కార్డులా వాడుకుని, కుక్క చావు చావమన్న ఫియాన్సీ.. కలికాలం!!
ప్రేమించిన పాపానికి ఏటీఎం కార్డులా వాడేసింది. అతని జీతం నెలనెలా లాగేసుకుంది. కాబోయే భార్యే కదా అని ఇస్తూ వచ్చిన యువకుడు చివరికి ప్రియురాలు షాకివ్వడంతో కంగుతిన్నాడు. ఇక నీ అవసరం నాకు లేదు.. కుక్క చావు చావమంటూ వదిలేసి వెళ్లిపోవడంతో తట్టుకోలేకపోయిన యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ అత్యంత విషాద ఘటన గుజరాత్‌లో జరిగింది. రమోల్‌కి చెందిన అన్నదమ్ములు ఇంతియాజ్, మెహతాబ్(24) ఫైసల్ నగర్‌లో నివాసం ఉండేవారు. ఫైజాబాద్‌కి చెందిన ఫిర్దాస్ అనే యువతితో వారికి పరిచయం ఏర్పడింది. గతంలో ఫైసల్ నగర్‌లో నివాసం ఉండడంతో వారి మధ్య సాన్నిహిత్యం కుదిరింది. తమ్ముడు మెహతాబ్ ఆమెను ఇష్టపడ్డాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నేళ్లపాటు ప్రేమించుకున్నారు. ప్రియురాలి కోరికలు తీర్చేందుకు మెహతాబ్ తను సంపాదించిన డబ్బులన్నీ ఖర్చు చేసేవాడు. ఆమె అడిగింది లేదనకుండా సమకూర్చేవాడు. ఈ క్రమంలో ఇరుకుటుంబాల పెద్దలు గత జూలైలో వారికి వివాహం నిశ్చయించారు. వచ్చే ఏడాది 2021లో పెళ్లి చేయాలని నిర్ణయించారు. అప్పటి వరకూ ప్రియుడిని ఏటీఎం కార్డులా వాడేసిన ఫిర్దాస్.. పెళ్లి నిశ్చయం అయ్యాక మరింత వేధించడం మొదలుపెట్టింది. ఆమె డిమాండ్లు పెరిగిపోయాయి. తాజాగా మరో మూడు లక్షలు ఇవ్వాలంటూ కాబోయే వాడిపై ఒత్తిడి తెచ్చింది. అందుకు ఆమె తండ్రి కూడా తోడయ్యాడు. తమకు అడిగినంత డబ్బులు ఇస్తేనే పెళ్లి జరుగుతుందని.. లేకుంటే నిలిపివేస్తామని హెచ్చరించారు. దీంతో తాను మోసపోయానని తీవ్ర మనస్థాపానికి గురైన మెహతాబ్ చేసుకున్నాడు. చనిపోయే ముందు తన ప్రియురాలు, ఆమె తండ్రి గురించి రాసి పెట్టి మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. Also Read:
By December 06, 2020 at 03:19PM
No comments