భర్త కోసం కాజల్ అగర్వాల్ న్యూ స్టెప్.. పక్కా ప్లాన్‌తో భార్య చేతిలో ఆ బాధ్యతలు పెట్టిన గౌతమ్!
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
![](https://telugu.samayam.com/photo/79591037/photo-79591037.jpg)
రీసెంట్‌గా సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు సైలెంట్‌గా ప్రేమ వ్యవహారం నడిపిన ఈ బ్యూటీ మూడుముళ్ల బంధంతో ప్రియుడి ఇంట చేరిపోయింది. పెళ్లి కావడమే ఆలస్యం కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేసి.. ఎంచక్కా హానీమూన్ ట్రిప్ వేసింది. మాల్దీవుల్లోని అందమైన లొకేషన్స్ చేట్టేస్తూ రొమాంటిక్ టూర్ వేసిన ఈ అమ్మడు తాజాగా భర్త కోసం మరో అడుగేసి వార్తల్లో నిలిచింది. బిజినెస్‌మెన్ అయిన కాజల్ అగర్వాల్ భర్త ఆమెకు కొత్త బాధ్యతలు అప్పగించాడు. ప్రముఖ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీని నడిపిస్తున్న గౌతమ్ పక్కాగా ప్లాన్ చేసి తన బిజినెస్ వ్యవహారంలో భార్య తోడు కోరుకున్నాడు. కాజల్‌కి ఉన్న ఇమేజ్‌ని తన బిజినెస్ కోసం వాడుకుంటూ ఫుల్లుగా ప్రమోట్ చేసుకోవాలని స్కెచ్చేసిన ఆయన.. కాజల్‌ని తన బ్రాండ్‌కి అంబాసిడర్‌గా నియమించాడు. మరోవైపు కాజల్ కూడా తన భర్త నిర్ణయాన్ని గౌరవించి ఆ బాధ్యతలు స్వీకరించింది. Also Read: గౌతమ్ కిచ్లూకి చెందిన ఇ- కామర్స్ సంస్థ డిస్కర్న్ లివింగ్‌కి కాజల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనుంది. ఈ సంస్థ కోసం కాజల్ యాడ్ షూటింగ్స్‌లో పాల్గొంటోంది. త్వరలోనే ఈ యాడ్స్ ప్రసారం కానున్నాయి. ఈ క్రమంలోనే తన భర్త కంపెనీకి సంబంధించిన కంపెనీ గురించి ట్విట్టర్‌లో ట్వీట్స్ చేయడం ప్రారంభించింది కాజల్. ఈ బ్రాండ్ పబ్లిసిటీ బ్రోచర్స్ కూడా త్వరలోనే విడుదల చేయనుందట. సో.. ఇదంతా చూస్తుంటే సూపర్ ఫాలోయింగ్ ఉన్న కాజల్ తోడు గౌతమ్‌కి ఖచ్చితంగా ప్లస్ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఇక కాజల్ సినిమాల విషయానికొస్తే.. కొరటాల శివ- చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న 'ఆచార్య' మూవీలో నటిస్తోంది. అతి త్వరలో ఈ మూవీ షూటింగ్‌లో ఆమె జాయిన్ కానుంది. దీంతో పాటు కమల్ హాసన్ సరసన ఇండియన్ 2 మూవీలో కూడా నటిస్తోంది చందమామ.
By December 06, 2020 at 02:05PM
No comments