హైదరాబాద్‌లో రజినీకాంత్... ‘అన్నత్తే’ షూటింగ్ షురూ
ఓ వైపు రాజకీయ పార్టీ స్థాపనకు సన్నాహాలు చేస్తూనే.. మరోవైపు సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు సూపర్‌స్టార్ రజినీకాంత్. ఆయన హీరోగా శివ దర్శకత్వంలో ‘అన్నత్తే’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. తమిళంలో ‘అన్నత్తే’ అనే పదానికి తెలుగులో అన్నయ్య అని అర్థం. ఇందులో అన్నగా రజనీ సందడి చేస్తారని టైటిల్ చూస్తేనే తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ సోమవారం నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభం కానుంది. ఇందుకోసం రజినీ ఆదివారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సినిమాలో రజినీ సరసన నయనతార నటిస్తోంది. సుదీర్ఘంగా సాగే షెడ్యూల్‌లో పాల్గొనేందుకు నటీనటులు, యూనిట్ సభ్యులందరూ ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇందులో కీర్తి సురేష్, ఖుష్బూ, మీనా, ప్రకాష్‌రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
By December 14, 2020 at 07:43AM
No comments