Breaking News

హథ్రాస్ కేసు: పోలీసుల జాప్యం వల్లే ఆధారాలు మాయం..నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపిన సీబీఐ


హథ్రాస్ బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్టు తన ఛార్జ్‌షీట్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల్లో జాప్యం వల్లే ఆధారాలు లభించలేదని సీబీఐ పేర్కొంది. బాధిత కుటుంబం ఫిర్యాదును పట్టించుకోని చందాపా పోలీసులు.. బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకుని, ఆమెను వైద్య పరీక్షలకు తరలించే విధానాన్ని అనుసరించలేదని తెలిపారు. సెప్టెంబరు 14న ఈ ఘటన జరిగితే, సెప్టెంబరు 22న ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారని వివరించారు. సీబీఐ ఆరోపణలపై స్పందించిన ఓ పోలీసు ఉన్నతాధికారి.. వారి నిర్లక్ష్యం గురించి ప్రభుత్వం తెలుసుకున్న వెంటనే ఎస్పీతో సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశామన్నారు. ‘మా దర్యాప్తు సరైన దిశలో సాగింది.. బాధితురాలు వెల్లడించిన వెంటనే నలుగురు నిందితులను అరెస్టు చేశారు.. మా ఎఫ్ఐఆర్‌నే సీబీఐ పరిగణనలోకి తీసుకుంది.. ఇందులో నిందితులపై మోపిన అభియోగాలు అన్నీ ఉన్నాయి’ అని ఆయన చెప్పారు. అలాగే, బాధిత కుటుంబం డిమాండ్ చేయకుండానే సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం సిఫారసు చేసిందని ఆయన అన్నారు. హథ్రాస్ ప్రత్యేక కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సీబీఐ.. స్థానిక పోలీసుల నిర్లక్ష్యాన్ని మరోసారి ఎత్తిచూపింది. ‘బాధితురాలి సోదరుడి వాంగ్మూలం ప్రకారం.. తన సోదరిపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత చంపడానికి నిందితుడు సందీప్ ప్రయత్నించాడు.. కానీ, పోలీసులకు ఫిర్యాదుచేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించి, కనీసం వైద్య పరీక్షలకు పంపకుండా, ఫోరెన్సిక్ ఆధారాలను భద్రపరచలేదు.. చాందపా పోలీస్ స్టేషన్‌లో మహిళా అధికారి కూడా లేదు.. ఫిర్యాదు చేసిన తర్వాత బాధితురాలి పట్ల అవమానకరంగా ప్రవర్తించారు కానీ, వైద్య పరీక్షలు సెప్టెంబరు 19 వరకు చేయించలేదు.. తనపై నలుగురు అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు వెల్లడించిన తర్వాత సెప్టెంబరు 22న వైద్య పరీక్షలకు పంపారు.. ఈ కేసులో పోలీసులు, ఇతర అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది’ అని పేర్కొంది. ఘటన గురించి మరో సాక్షి చెప్పిన వివరాల ప్రకారం.. బాధిత యువతి, ప్రధాన నిందితుడు సందీప్‌‌ మధ్య కొద్ది రోజులు ప్రేమ వ్యవహారం నడిచింది.. కానీ, దీనికి నేరంతో ఏ సంబంధం లేదు. సందీప్ తరుచూ తమ కుమార్తెకు ఫోన్ చేయడం గురించి తెలిసిన కుటుంబసభ్యులు అతడి తండ్రికి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత సందీప్ ఫోన్ చేస్తున్నా యువతి పట్టించుకోలేదు.. నలుగురు నిందితులు ఘటన జరిగినప్పుడు గ్రామంలోనే ఉన్నారని సీబీఐ విచారణలో వెల్లడయ్యింది.


By December 20, 2020 at 02:16PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/hathras-case-delay-in-victims-med-examination-led-to-evidence-loss-says-cbi/articleshow/79823621.cms

No comments