ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు కాస్త జాగ్రత్త..! మీరు కూడా నా లాగే మోసపోకండి.. షకీలా ఎమోషనల్ కామెంట్స్
ఆనాటి నుంచి నేటితరం ఆడియన్స్ వరకు శృంగార తార అంటే తెలియని వారుండరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బోలెడన్ని సినిమాలు చేసింది.. అన్నీ లో- బడ్జెట్ సినిమాలే.. పైగా అన్ని సినిమాల్లోనూ ఆమెదే లీడ్ రోల్. పాత్ర ఎలాంటిదన్నది పక్కనబెడితే తన నటనకు న్యాయం చేయడంలో షకీలా నూటికి నూరు పాళ్ళు సక్సెస్ అయింది. అందుకే షకీలా అంటే నేటితరం ప్రేక్షకులకు సైతం అదో రకమైన క్రేజ్. ఇదే క్రేజ్ క్యాష్ చేసుకునేలా పాన్ ఇండియా సినిమాగా 'షకీలా' బయోపిక్ రూపొందించారు ఇంద్రజిత్ లంకేశ్. శృంగార తారగా చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన షకీలా ఒకానొక సమయంలో రసిక ప్రియుల ఆరాధ్యదైవంగా వెండితెరపై హంగామా చేయడమే గాక నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. కాకపోతే ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదొడుకులు ఉన్నాయి. వాటన్నింటికీ తెర రూపమిచ్చే ప్రయత్నమే . ఈ సినిమాలో షకీలా పాత్రలో కనిపించనుంది. ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వం వహించారు. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. Also Read: తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న షకీలా.. తాను బతికుండగానే తన బయోపిక్ వస్తుండటం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. అందరం కూడా మన వ్యక్తిగత జీవితాల్లో ఏదో ఒక రకంగా ఇబ్బందులు పడుతుంటాం. బాధలు ఎదుర్కొంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం పడే బాధలు ఎదుటివాళ్ళకు తెలియక తప్పుగా మాట్లాడుతుంటారు. నేనైతే అలాంటి మాటలు పట్టించుకోనని షకీలా చెప్పుకొచ్చారు. Also Read: అయితే సినీ పరిశ్రమలోకి వస్తున్న యువతులు, చదువుకుంటున్న అమ్మాయిలకు నేను చెప్పేది ఒక్కటే అంటూ ''జీవితంలో నేను చేసిన తప్పులు మీరు చేయకండి. నా లాగా అస్సలు మోసపోకండి. ఈ సినిమాలో మహిళల కోసమే ప్రత్యేకంగా ఓ సందేశం ఉంది. ఇలా నా బయోపిక్‌తో మహిళలకు మంచి సందేశాన్ని ఇవ్వనుండటం సంతోషంగా అనిపించింది'' అని షకీలా అన్నారు. తన నిజ జీవితంలో సొంత సిస్టరే తనను మోసం చేసిందని గత ఇంటర్వ్యూల్లో షకీలానే స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే. సో.. చూడాలి మరి ఈ బయోపిక్‌లో షకీలా జీవితంలోని ఏయే అంశాలపై ఫోకస్ పెట్టారనేది!.
By December 20, 2020 at 02:12PM
No comments