Breaking News

ట్రంప్‌తో విడాకులపై జోరుగా ప్రచారం.. మెలానియా కీలక నిర్ణయం


అమెరికా ప్రథమ మహిళ, సతీమణి గురించి ఇటీవల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే. ట్రంప్ అధ్యక్ష పీఠం నుంచి వైదొలగిన తర్వాత ఆయనకు విడాకులు ఇస్తున్నారనే ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగా.. మెలానియా ట్రంప్‌ వైట్‌హౌస్‌లో అనుభవాలను పుస్తకరూపంలో తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ప్రథమ మహిళగా తన అనుభవాలను దానిలో వివరించనున్నారని, ఇందుకు అధ్యక్షుడు ట్రంప్‌ కూడా మద్దతు తెలిపారని అంటున్నారు. పేజ్ సిక్స్ కథనం ప్రకారం.. శ్వేతసౌధంలో తన జ్ఞాపకాలు, ప్రథమ మహిళగా ఎదురైన అనుభవాలను గురించిన ఓ పుస్తకాన్ని రాసేందుకు వివిధ ప్రచురణ సంస్థలతో మెలానియా సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ వ్యవహారంలో మెలానియాకు భారీ మొత్తమే లభించనుందని పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి మెలానియా గురించి ‘మెలానియా అండ్‌ మీ’ పేరుతో ఆమె స్నేహితురాలు సెప్టెంబర్‌లో ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. మెలానియాకు ఒకప్పుడు ప్రాణ స్నేహితురాలైన స్టీఫెన్‌ విన్‌స్టన్‌ వోకాఫ్‌.. ఈ పుస్తకంలో వివాదాస్పద అంశాలను ప్రస్తావించారు. మెలానియాకు ఇబ్బంది కలిగించేలా ట్రంప్‌ తొలి భార్య సంతానం ఇవాంకాతో విబేధాలు తదితర వ్యక్తిగత విషయాలను ప్రస్తావించారు. అలాగే పలు వివాదాస్పద సంభాషణలున్న టేప్‌లను కూడా విడుదల చేశారు. వీటిపై స్పందించిన మెలానియా.. తాను ఆయా అంశాలను మాట్లాడిన సందర్భమే వేరని వివరణ ఇచ్చారు. ఆ పుస్తకం విడుదలైన అనంతరం స్టీఫెన్‌ విన్‌స్టన్‌పై మెలానియా తీవ్ర విమర్శలు గుప్పించారు. గుర్తింపు పొందడం కోసం తనతో స్నేహంగా నటించిన స్టీఫెన్‌‌.. నీతి నిజాయితీ లేని అవకాశవాది అని ధ్వజమెత్తారు. ట్రంప్‌తో విడిపోవడానికి మెలానియా సిద్దంగా ఉన్నారని, ఆమె ఘడియలు లెక్కబెట్టుకుంటున్నారని ఇటీవల వోకాఫ్ వెల్లడించిన విషయం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్‌ మేనకోడలు మేరీ ఎల్‌ ట్రంప్‌ ‘టూ మచ్‌ అండ్‌ నెవర్‌ ఇనఫ్‌’ పేరుతో రాసిన పుస్తకంలో అధ్యక్షుడి గురించి పలు వివాదాస్పద అంశాలను బయటపెట్టిన విషయం విదితమే. ఇదిలా ఉండగా ట్రంప్‌ సైతం తన పదవీకాలంలో విశేషాలను వెల్లడించడానికి 100 మిలియన్‌ డాలర్ల మేర టీవీ, పుస్తక ఒప్పందాలు కుదుర్చుకున్నారని తెలిసింది. మరోవైపు, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ‘ఏ ప్రామిస్‌డ్‌ ల్యాండ్‌’ విడుదలైన 24 గంటల్లోనే 8,90,000కిపైగా కాపీలు అమ్ముడిపోయి రికార్డులు సృష్టించింది. ఆయన భార్య మిషెల్లీ ఒబామా 2018లో ప్రచురించిన ‘బికమింగ్‌’ కూడా రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది.


By December 01, 2020 at 07:20AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/amid-rumours-of-divorce-with-donald-trump-melania-trump-takes-key-decision/articleshow/79502227.cms

No comments