BAFTA: అరుదైన గౌరవం దక్కించుకున్న ఏఆర్ రెహమాన్
దేశం గర్వించదగ్గ ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా) ఆయన్ని ‘బాఫ్టా బ్రేక్ త్రూ ఇనిషియేటివ్ అంబాసిడర్’గా నియమించినట్లు సోమవారం ప్రకటించింది. ఈ క్రమంలో జ్యూరీ సభ్యులు, నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి ఆయన దేశంలోని సినిమా, క్రీడలు, టెలివిజన్ రంగాల్లో ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించనున్నారు. జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన కళాకారులకు సంవత్సరం పాటు మార్గనిర్దేశనం చేయనుంది.
ఈ ఘనత సాధించడం పట్ల రెహమాన్ స్పందిస్తూ... ‘భారత్ నుంచి అద్భుతమైన టాలెంట్‌ను వెలికితీసి ప్రపంచ వేదికపై నిలిపే అవకాశం నాకు రావడం సువర్ణావకాశంగా భావిస్తున్నా. బాఫ్టాతో కలిసి పనిచేసే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది’ అని తెలిపారు. ‘భారతీయ సినిమాతో రెహమాన్‌కు ఉన్న అనుభందం బాఫ్టాకు సేవలందించేందుకు ఉపయోగపడుతుంది. మా సంస్థకు ఆయన అంబాసిడర్‌గా నియమితులు కావడం చాలా సంతోషంగా ఉంది’ అని బాఫ్టా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమాండ బెర్రీ పేర్కొన్నారు. Also Read: ఆసBy December 01, 2020 at 07:47AM
No comments