Prabhas: ప్రభాస్‌తో మళ్లీ సినిమానా.. జనాలు భరించలేరు: రాజమౌళి షాకింగ్ కామెంట్స్
యంగ్ రెబల్‌స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ప్రభాస్‌ను ఆలిండియా స్టార్‌ని చేసింది కచ్చితంగా రాజమౌళి అనే చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి, ‘ఛత్రపతి’, ‘బాహుబలి 1’, ‘బాహుబలి2’ చిత్రాలలో ప్రభాస్‌ని ఏ రేంజ్‌లో రాజమౌళి ఎలివేట్ చేశారో అందరికీ తెలిసిందే. బాహుబలి, బాహుబలి-2 తర్వాత రేంజ్ బాలీవుడ్ హీరోలను మించిపోయింది. అందుకే దర్శక నిర్మాతలు ఆయనతో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించేందుకు పోటీ పడుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో మరో సినిమా వస్తే ఎలాగుంటుంది... ఇదే ప్రశ్న రాజమౌళికి ఎలాంటి సమాధానం ఇచ్చారో తెలుసా. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళికి ఇదే ప్రశ్న ఎదురైంది. ప్రభాస్‌తో మళ్లీ సినిమా తీస్తారా? అని అడగ్గా.. వామ్మో మళ్లీ ప్రభాస్‌తోనా? అంటూ బెదిరిపోయారు. Also Read: ‘బాహుబలి కోసం ఇద్దరం సుమారు ఐదేళ్లు కలిసి చేశాం. మళ్లీ మా కాంబినేషన్‌లో సినిమా అంటే జనాలు తలలు పట్టుకుంటారేమో’ అని అని రాజమౌళి సరదాగా కామెంట్ చేశారు. ప్రభాస్‌తో మళ్లీ సినిమా చేయడం తనకూ ఇష్టమేనని, మంచి కథ కుదిరితే కచ్చితంగా చేస్తానని చెప్పారు జక్కన్న. Also Read:By December 01, 2020 at 08:10AM
No comments