అప్పట్లో అమరావతిలో 50 ఎకరాల ఆసామి.. చివరికి హైదరాబాద్ చేరి.. షాకింగ్
ఆయనో 50 ఎకరాల ఆసామి. అది కూడా ఏపీ రాజధాని ప్రాంతం అమరావతిలో.! కోట్లు విలువ చేసే ఆస్తి. కానీ హారతి కర్పూరం అయిపోయింది. ఆయన వ్యసనం అధో:పాతాళానికి దిగజార్చింది. చివరికి డబ్బుల కోసం దొంగయ్యాడు. హైదరాబాద్ చేరి చోరీలు చేయడం మొదలుపెట్టాడు. ఓ ఇంట్లో దొంగతనం కేసులో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. అతని గురించి తెలుసుకుని అవాక్కయ్యారు. ఈ షాకింగ్ ఘటన వివరాలు సనత్‌నగర్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. జెక్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్లో ఆర్‌బీఐ ఉద్యోగి శేషసాయి నివాసముంటున్నారు. గత నెలల పశ్చిమ గోదావరి జిల్లాలోని తమ సొంతూరు వెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో చోరీ జరిగింది. సుమారు 35 తులాల బంగారం, వెండి వస్తువులు దోచుకెళ్లారు. అది గమనించిన అపార్ట్‌మెంట్ అసోసియేషన్ సనత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని గుర్తించారు. జిల్లా క్రోసూరు మండలం 88 తాళ్లూరుకి చెందిన రాయపాటి వెంకట్రావు చోరీ చేసినట్లు తేలడంతో గుంటూరు వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీసు విచారణలో నిందితుడి వివరాలు తెలుసుకుని షాకయ్యారు. వెంకట్రావుకి అమరావతి పరిధిలో 50 ఎకరాల పొలం ఉండేది. పేకాటకు బానిసైన వెంకట్రావు భూములను ఎకరం సుమారు రూ.50 లక్షల చొప్పున విక్రయిస్తూ పేకాటలో పోగొట్టుకున్నాడు. బెంగళూరు వెళ్లి మరీ పేకాట ఆడేవాడు. ఆస్తులు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. అయినా పేకాట వదల్లేక చోరీల బాట పట్టాడని తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. Also Read:
By December 12, 2020 at 08:47AM
No comments