తాగిన మైకంలో తల్లి కిరాతకం.. 9 నెలల కూతురిని.. దారుణం
అమ్మతనానాకే మాయని మచ్చ తెచ్చిందో కసాయి తల్లి. నవమాసాలు మోసి కన్న బిడ్డని కర్కశంగా నేలకేసి కొట్టి చంపేసింది. కడుపులో పెట్టుకుని కాపాడాల్సింది పోయి కిరాతకంగా అంతమొందించింది. ఈ అత్యంత దారుణ ఘటన జిల్లాలో జరిగింది. పరిగి నియోజకవర్గ పరిధిలోని గండీడ్ మండలం జక్లపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఫుల్లుగా మద్యం తాగి గొడవపడ్డారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో తీవ్ర ఘర్షణ జరిగింది. తాగిన మైకంలో ఉన్న భార్య విచక్షణ కోల్పోయి తన 9 నెలల చిన్నారిని నేలకేసి కొట్టింది. చిన్నారి తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. విగతజీవిగా పడి ఉన్న చిన్నారిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కసాయి తల్లిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read:
By December 12, 2020 at 09:27AM
No comments