Breaking News

ఫైజర్ టీకాకు అమెరికా ఆమోదం.. 24 గంటల్లోగా వ్యాక్సినేషన్ ప్రారంభం


ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు అగ్రరాజ్యం అమెరికాలోనే చోటుచేసుకుంటున్నాయి. మహమ్మారితో సతమతమవుతున్న అమెరికాలో వ్యాక్సినేషన్‌ దిశగా తొలి అడుగు పడింది. ఫైజర్‌ వ్యాక్సిన్‌కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ () అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసింది. గురువారం 8 గంటల పాటు జరిపిన బహిరంగ చర్చ అనంతరం ఈ ఆమోదం తెలిపింది. మరో 24 గంటల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ‘ నివారణకు ఫైజర్-బయోఎన్‌టెక్ టీకా అత్యవసర వినియోగానికి ఆమోదం తెలుపుతున్నాం’ అని ఎఫ్‌డీఏ చీఫ్ సైంటిస్ట్ డెనైజ్ హింటన్ పేర్కొన్నారు. అంతకు ముందు ఎఫ్‌డీఏకు బయట నుంచి సలహాలు ఇచ్చే నిపుణుల కమిటీ అనుకూలంగా నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. ఎఫ్‌డీఏ‌ ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ ఫైజర్-బయోఎంటెక్ కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను సిఫారసు చేయడానికి అనుకూలంగా ఓటు వేసింది. ఈ సందర్భంగా జరిగిన ఓటింగ్‌లో ఫైజర్ నివేదికకు అనుకూలంగా 17 ఓట్లు, వ్యతిరేకంగా నాలుగు, ఒకరు తటస్థంగా ఉండిపోయారు. అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాలు ఆధారంగా ఫైజర్-బయోఎన్‌టెక్ కోవిడ్ -19 టీకా 16 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులలో ముప్పును తప్పిస్తుందా? అనేది పరిశీలించామని నిపుణుల కమిటీ తెలిపింది. ‘ఫైజర్‌ టీకా విషయమై ఎఫ్‌డీఏ బృందం శాస్త్రీయ న్యాయస్థానంలా విచారణ చేపడుతోంది. వ్యాక్సిన్‌ సురక్షితమేనా? ఎలాంటి దుష్ప్రభావాలుంటాయి? దీని పనితీరు ఎలా ఉంది? అత్యవసర వినియోగానికి ఇది యోగ్యమైనదేనా? అన్న విషయాలను లోతుగా చర్చిస్తారు. ఇందుకు సంబంధించి ప్రయోగ పరీక్షల డేటాను విశ్లేషిస్తారు’ అని ఎఫ్‌డీఏ ఉన్నతాధికారి డోరన్‌ ఫింక్‌ తెలిపారు. క్లినికల్ ట్రయల్స్‌లో 44 వేల మందికి ప్రయోగాత్మకంగా టీకా అందించిన ఫైజర్, ఫలితాలను నమోదు చేసింది. టీకా ప్రభావవంతంగా పనిచేస్తోందని, ఎవరిలోనూ పెద్దగా దుష్ప్రభావాలు కనిపించలేదని నిపుణులు గుర్తించారు. అయితే- హెచ్‌ఐవీ, ఇతర వైరస్‌లతో బాధపడుతున్నవారిలో ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? గర్భిణులకు ఈ టీకాను సిఫార్సు చేయొచ్చా? అన్న విషయాలపై నిపుణులు లోతుగా చర్చించారు.


By December 12, 2020 at 08:46AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-fda-clears-pfizer-covid-vaccine-for-emergency-use/articleshow/79690000.cms

No comments