Breaking News

మైనర్ బాలుడికి బైక్ ఇచ్చిన ఓనర్‌కు భారీ షాక్.. రూ.26 వేల ఫైన్, బండి సీజ్


మైనర్ బాలుడికి (Juvenile) స్కూటీ ఇచ్చినందుకు ఓ ఓనర్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఆ బాలుడు స్కూటీ నడుపుతూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటమే కాకుండా, హెల్మెట్ లేకుండా వాహనం నడిపాడు. దీంతో అతడికి బైక్ ఇచ్చిన వ్యక్తికి పోలీసులు షాకిచ్చారు. మొత్తం రూ.26 వేల ఫైన్ విధించారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మైనర్‌కు వాహనం నడిపేందుకు అనుమతి ఇచ్చినందుకు ఆ యజమానికి మోటారు వాహన చట్టం-2019 కింద రూ.25,000 జరిమానా విధించగా.. బాలుడు హెల్మెట్‌ ధరించకపోవడంతో మరో రూ.1000 జరిమానా వేశారు. అంతే కాకుండా స్కూటీ డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తికి లైసెన్స్‌ లేకపోవడంతో సెక్షన్‌ 207 కింద కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్‌ చేశారు. మైనర్ బాలుడే కదా.. మళ్లీ లైసెన్స్ ఎక్కడ నుంచి వస్తుంది అనే అనుమానం రావొచ్చు. మరి నిబంధనలు అలాగే ఉన్నాయి మరి. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ శివార్లలోని కందగిరి ప్రాంతంలో పోలీసులు తనిఖీల్లో భాగంగా ఆ మైనర్ బాలుడిని పట్టుకున్నారు. సదరు స్కూటీ నిరంజన్‌ దాష్ అనే వ్యక్తికి సంబంధించినదిగా గుర్తించారు. వాహనాన్ని సీజ్ చేసి, అతడికి సమాచారం ఇచ్చారు. ఒడిశాలో ఈ తరహా ఘటన ఇంతకుముందు మరొకటి కూడా చోటు చేసుకుంది. నాడు ఇంతకంటే ఎక్కువే జరిమానా విధించారు. ఫిబ్రవరిలో ఓ వ్యక్తి మైనర్‌ బాలుడికి బైక్ ఇచ్చిన కారణంగా.. అతడికి, అతడి తండ్రికి భారీ జరిమానా విధించారు. తప్పులన్నింటికీ కలిపి మొత్తం రూ. 42,500 జరిమానా విధించారు. సాధారణ నేరం కింద రూ.500, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోవడం వల్ల రూ.5000, ట్రాఫిక్‌ నిబంధనలకు ఉల్లంఘించినందుకు రూ.5000, టూ వీలర్‌పై ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణిస్తున్నందుకు రూ. 1000, హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్నందుకు రూ.1000, మైనర్ వాహనం నడుపుతున్నందుకు మోటారు వాహనాల చట్టం-2019 ప్రకారం రూ.25000 జరిమానా విధించారు. మోటారు వాహన చట్టం-2019కు నరేంద్ర మోదీ ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు కమిటీ సూచనల ప్రకారం.. యాక్సిడెంట్లను అదుపు చేయడానికి ఈ చట్టం కింద కఠిన నిబంధనలను ప్రవేశపెట్టారు. భారీ జరిమానాలను విధిస్తున్నారు. బైక్‌పై ప్రయాణించే ఇద్దరు వ్యక్తులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే. హెల్మెట్ లేకుండా పిలియన్ రైడర్స్ (pillion rider) పట్టుబడితే.. కొత్త చట్టం ద్వారా బైక్ నడిపే వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అధికారం పోలీసులకు ఉంది. ఇక మైనర్లకు వాహనాలు ఇస్తే అంతే సంగతలు. కాబట్టి జాగ్రత్త.. మన మంచికే! Also Read: Must Read:


By December 10, 2020 at 08:41AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/scooty-owner-fined-rs-26000-for-letting-minor-ride-it-bike-seized-in-odisha/articleshow/79654880.cms

No comments