పాార్లమెంట్ భవనానికి నేడు ప్రధాని శంకుస్థాపన
నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం భూమిపూజ నిర్వహించనున్నారు. కొత్త పార్లమెంట్ భవనానికి కేవలం భూమిపూజ మాత్రమే నిర్వహించాలని, నిర్మాణం లేదా కూల్చివేత పనులు చేపట్టవద్దని కేంద్రానికి రెండు రోజుల కిందట సూచించిన విషయం తెలిసిందే. దీంతో ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం కేవలం శంకుస్థాపన మాత్రమే నిర్వహిస్తున్నారు. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి సంబంధించిన నమూనాలను డిసెంబరు 5న కేంద్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. అడుగడుగునా భారతీయత ఉట్టిపడేలా మొత్తం 64,500 చదరపు మీటర్ల పరిధిలో ఈ నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించనున్నారు. భూకంపాలు, ఇతర ప్రకృతి విపత్తులను తట్టుకునేలా ఈ భవన నిర్మాణం చేపడుతున్నారు. పార్లమెంట్ భవన నిర్మాణానికి రూ.971 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ భవన నిర్మాణ బాధ్యతలను దిగ్గజ సంస్థ ‘టాటా’ చేపట్టింది. 2021 ఆగస్టు 15 నాటికి నూతన పార్లమెంట్ భవన నిర్మాణం పూర్తి చేసి, కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది ఆగస్టు 15న దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోనుంది. ఈ అరుదైన ఘట్టానికి సాక్ష్యంగా పార్లమెంట్ కొత్త భవనాన్ని తీర్చిదిద్దాలని సంకల్పించారు. విశాలమైన ఈ భవనంలో లోక్ సభ సభ్యుల కోసం 888 సీట్లు, రాజ్య సభ సభ్యుల కోసం 326 సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంట్ ఉభయ సభల సమావేశం జరిగితే.. లోక్‌సభలో ఒకేసారి 1224 మంది సభ్యులు కూర్చునేలా సీట్లు ఏర్పాట్లు చేస్తారు. మొత్తం 18.37 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంతో నిర్మించే పార్లమెంట్ విస్టా భవనం ప్రాజెక్టు కోసం రూ.11,794 కోట్లుఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అంతకు మందు మొత్తం రూ.11,038 కోట్లు అవుతుందని అంచనా వేసినా.. ప్రస్తుతం అదనంగా మరో రూ.794 కోట్లు పెరిగింది. సెంట్రల్ సెక్రటేరియట్‌ను 2024కు పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
By December 10, 2020 at 09:06AM
No comments