Breaking News

రాజశేఖర్ కుమార్తెతో ‘118’ ద‌ర్శకుడి కొత్త చిత్రం.. విచిత్రమైన టైటిల్


నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ‘118’ వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాన్ని తెర‌కెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్ త‌న త‌దుప‌రి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి కూడా డిఫ‌రెంట్ థ్రిల్లర్‌తో వస్తున్నారు. ఈ చిత్రానికి ‘WWW’ (హూ, వేర్‌, వై) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అదిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీని రామంత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై డా. ర‌వి పి. రాజు ద‌ట్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాలు జ‌రుపుకుంటోంది. త్వర‌లో ఈ చిత్రం టైటిల్‌ లోగోను విడుద‌ల‌చేయ‌నున్నారు. సినిమా టైటిల్‌ను ప్రకటించిన సంద‌ర్భంగా నిర్మాత‌ డా. ర‌వి పి.రాజు ద‌ట్ల మాట్లాడుతూ.. ‘‘కేవీ గుహ‌న్ గారు తెర‌కెక్కించిన ‘118’ మూవీ ఎంత‌ పెద్ద హిట్ అయ్యిందో మ‌నంద‌రికీ తెలుసు. ఇప్పుడు ఆయ‌న రెండో చిత్రంగా ఒక డిఫ‌రెంట్ థ్రిల్లర్ స‌బ్జెక్ట్‌తో వస్తున్నారు. దీనికి ‘WWW’ అనే టైటిల్ ఖరారు చేశాం. రామంత్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ మూవీ రూపొందుతోంది. సిమ‌న్ కె. కింగ్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా మిర్చికిర‌ణ్ ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ అందించారు. టెక్నిక‌ల్‌గా మంచి టీమ్ కుదిరింది. త్వర‌లోనే టైటిల్ లోగోని విడుద‌ల‌చేస్తాం’’ అని అన్నారు. Also Read: చెన్నైకు చెందిన కేవీ గుహన్ తెలుగులో సినిమాటోగ్రాఫర్‌గా స్టార్ హీరోలతో పనిచేశారు. మహేష్ బాబు ‘నాని’ సినిమాతో గుహన్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తరవాత ‘అతడు’, ‘జల్సా’, ‘గమనం’, ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘బాద్‌షా’, ‘ఆగడు’, ‘తిక్క’, ‘మిస్టర్’, ‘జవాన్’ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఓవైపు సినిమాటోగ్రఫీ చేస్తూ డైరెక్టర్‌గా సత్తాచాలని అనుకున్నారు గుహన్. అందుకే, తెలుగులో సూపర్ హిట్ అయిన ‘హ్యాపీ డేస్’ సినిమాను తమిళంలో రీమేక్ చేసి దర్శకుడిగా మారారు. ఆ తరవాత రెండో సినిమాగా ‘118’కు దర్శకత్వం వహించారు. ఇప్పుడు మూడో సినిమాతో సిద్ధమవుతున్నారు.


By December 15, 2020 at 04:54PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/118-director-kv-guhan-latest-film-titled-www/articleshow/79740147.cms

No comments