Breaking News

Roja: రోజాతో రొమాన్స్ చేస్తుంటే.. అన్నా అన్నా అనేది.. ఆపెహే అని నేను..: హీరో శ్రీకాంత్


హీరో నటించిన ‘ప్రేయసి రావే’ చిత్రం 21 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో మీడియాతో ముచ్చటించారు శ్రీకాంత్. ఇప్పటికీ ఆ సినిమా చూస్తే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయని.. ఫ్రెష్ ఫీల్ కలుగుతుందని అని అన్నారు హీరో శ్రీకాంత్. ఈ సందర్భంగా తన కెరియర్‌లో మంచి సినిమా ఇచ్చిన నిర్మాత రామానాయుడుకి ధన్యవాదాలు తెలిపారు శ్రీకాంత్. ఆ సినిమా జ్ఞాపకాలను తెలియజేస్తూ.. ‘ప్రేయసి రావే’ సినిమాతో చంద్ర మహేష్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. పోసాని గారి డైలాగ్స్.. శ్రీలేఖ మ్యూజిక్.. రాశి నేను కలిసి నటించడం అలా కుదిరింది. ఈ సినిమా క్రెడిట్ మొత్తం రామానాయుడిగారికే దక్కుతుంది. పట్టు పట్టి మరీ నాతో ఆ సినిమా చేయించారు. హీరోయిన్ రాశి చాలా మంది ఆర్టిస్ట్.. నేను రాశి కలిసి ఐదారు సినిమాలు చేశా.. అప్పట్లో సౌందర్య, రాశి, రమ్యక్రిష్ణ వీళ్లంతా మంచి మంచి ఆర్టిస్ట్‌లు. వీళ్లంతో ఒకటి రెండు సినిమాలతో ఆగిపోయిన జర్నీ కాదు.. వరుసగా కలిసి చేసేవాళ్లం. అంతా ఫ్రెండ్స్ మాదిరి ఉండేవాళ్లం. ఫ్యామిలీ పర్సన్ అయిపోయేవాళ్లం.. మంచి బాండింగ్ ఉండేది. రిలేషన్స్ కలుపుకుని మాట్లాడటం ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. నన్ను అన్నయ్య అని పిలుస్తుంటుంది. ఇద్దరం కలిసి రెండు మూడు సినిమాలు చేశాం. క్షేమంగా వెళ్లి లాభంగా రండి, తిరుమల తిరుపతి వెంకటేశ లాంటి సినిమాల్లో జోడీగా నటించాం.. నన్ను అన్నా అన్నా అని పిలిచేది. షూటింగ్ జరిగేటప్పుడు సాంగ్స్, రొమాన్స్ చేసేటప్పుడు అన్నా.. అలా చేద్దాం ఇలా చేద్దాం అంటే.. హే ఆపు!! కాసేపు అయినా అన్నా అని పిలవడం.. నాకు నువ్ అలా పిలిస్తే ఆ ఫీల్ రావడం లేదు అని అనేవాడిని.. ఇద్దరం కలిసి నవ్వుకుండా అలా చేసుకుంటూ వెళ్లిపోయేవాళ్లం. చాలా సరదాగా ఉండేవాళ్లం’ అంటూ చెప్పుకొచ్చారు హీరో శ్రీకాంత్.


By December 15, 2020 at 04:49PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/senior-hero-srikanth-shared-funny-incident-with-actress-roja/articleshow/79739831.cms

No comments