Breaking News

ద్వేషపూరిత రాజకీయాలకు కేంద్రంగా యూపీ.. యోగికి 104 మంది మాజీ ఐఏఎస్‌ల లేఖ


ద్వేషపూరిత రాజకీయాలకు ఉత్తర్‌ప్రదేశ్ మూల కేంద్రంగా మారిందని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు 104 మంది మాజీ ఐఏఎస్‌లు లేఖ రాయడం సంచలనంగా మారింది. ఉత్తర్‌ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద మాతమార్పిడి ఆర్డినెన్స్ రాష్ట్రాన్ని‘ద్వేషం, విభజన, మూర్ఖత్వం’ రాజకీయాల కేంద్రంగా మార్చింది అని మాజీ అధికారులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. మొత్తం 104 మంది మాజీ ఐఏఎస్ అధికారులు ఈ లేఖపై సంతకం చేశారు. వీరిలో మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, విదేశాంగ మాజీ కార్యదర్శి నిరుపమా రావ్, ప్రధాని మాజీ సలహాదారు టీకేఏ నాయర్ తదితర ప్రముఖులు ఉన్నారు. చట్ట విరుద్దమైన ఈ ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సమా రాజకీయ నేతలందరూ తాము సమర్ధిస్తామని ప్రమాణం చేసిన రాజ్యాంగం గురించి పునఃఅవగాహన చేసుకోవాలని సూచించారు. ‘ఒకప్పుడు గంగా-జమున నాగరికతకు ఊయల మాదిరిగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్.. ప్రస్తుతం ద్వేషపూరిత రాజకీయాలకు, విభజవాదానికి, మూర్ఖత్వానికి కేంద్రంగా మారింది..పాలనా వ్యవస్థలు ఇప్పుడు మతపరమైన విషంలో చిక్కుకుపోయాయి’ అని దుయ్యబట్టారు. ‘మీ పరిపాలనలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని భారత యువతపై దారుణమైన క్రూరత్వాల పరంపర కొనసాగుతోంది.. దేశంలోని భారతీయులు స్వేచ్ఛాయుత పౌరులుగా తమ జీవితాలను గడపాలని కోరుకుంటారు’ అని ధ్వజమెత్తారు. ఇటీవల యూపీలో మతమార్పిడి చట్టం పేరుతో జరుగుతున్న అకృత్యాలను ఈ లేఖలో ప్రస్తావించారు. మతమార్పిడి పాల్పడ్డారనే ఆరోపణలతో ఇద్దరు వ్యక్తులపై భజరంగ్ దళ్ కార్యకర్తలు, పోలీసులు దారుణంగ వ్యవహరించన ఘటనను ఇందులో లేవనెత్తారు. "అమాయకులైన దంపతులను వేధించి, ఇబ్బందులకు గురిచేస్తే పోలీసులు మౌనంగా ఉన్నారు. బహుశా ఆ వేధింపుల ఫలితంగా ఆ మహిళకు గర్భస్రావం జరిగింది’ అని అన్నారు. యూపీలోని బిజినోర్‌లో ఇద్దరు టీనేజర్లపై ఆకస్మికంగా దాడిచేసి, వేధించిన తర్వాత పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఓ 16 ఏళ్ల హిందూ బాలికను బలవంతంగా మతం మార్చినట్టు ఆరోపణలు గుప్పించి, ఓ టీనేజర్‌కు వారం రోజుల పాటు జైల్లో ఉంచారు. అయితే, ఈ ఆరోపణలు సదరు బాలిక, ఆమె తల్లి కొట్టిపారేశారు. ‘ఈ దురాగతాలు, చట్ట పాలనకు బద్ధులై ఉన్న భారతీయుల భావాలతో సంబంధం లేకుండా నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.. మత మార్పిడి వ్యతిరేక ఆర్డినెన్స్ ... ముఖ్యంగా ముస్లిం యువకులు, స్వేచ్ఛను ఉపయోగించుకునే ధైర్యం ఉన్న మహిళల కోసం ఒక కర్రగా ఉపయోగిస్తున్నారు’ అని లేఖలో మండిపడ్డారు. లవ్ జీహాదీపై అలహాబాద్ హైకోర్టు సహా పలు రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ఈ లేఖలో ప్రస్తావించారు. ‘జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుని అలహాబాద్ హైకోర్టు సహా పలు హైకోర్టులు నిస్సందేహంగా తీర్పులు వెలువరించాయి.. యూపీ మాత్రం ఆ రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది’ అని ధ్వజమెత్తారు.


By December 30, 2020 at 08:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/up-epicentre-of-politics-of-hate-104-ex-ias-officers-to-yogi-adityanath/articleshow/80020139.cms

No comments