Breaking News

Visakha: లేడీ కానిస్టేబుల్‌ దారుణ హత్య


విశాఖ జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న లేడీ కానిస్టేబుల్ చందక భవాని మృతి కేసులో మిస్టరీ వీడింది. కట్టుకున్న భర్తే అనుమానంతో కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఆమెను తీవ్రంగా కొట్టి.. మెడకు ఉరి బిగించి అంతమొందించాడు. ఎస్సై రామక్రిష్ణ తెలిపిన వివరాల మేరకు.. పాయకరావుపేట మండలం పెద్దిపాలేనికి చెందిన భవానికి అంకంపేటకి చెందిన నాగళ్ల సింహాద్రితో 2008లో వివాహమైంది. భవాని 2017లో కానిస్టేబుల్‌గా ఎంపికైంది. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం 2018 మే నెలలో నక్కపల్లిలో పోస్టింగ్ వచ్చింది. గతేడాది నుంచి స్టేషన్‌ సమీపంలో ఉన్న క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు. వారికి కూతురు(11), కొడుకు(9) ఉన్నారు. కొద్దికాలంగా భార్య భవానిపై పెంచుకున్న భర్త సింహాద్రి తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఆమెకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ద్వేషం పెంచుకున్నాడు. రెండు రోజుల కిందట విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన భవాని ఫోన్ చెక్ చేసేందుకు ప్రయత్నించాడు. అది ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. భార్యపై ఆగ్రహంతో ఊగిపోయిన సింహాద్రి ఆమెను తీవ్రంగా కొట్టి.. తాడుతో మెడకు ఉరి బిగించి అమానుషంగా అంతమొందించాడు. అనంతరం ఆమెను శ్లాబు హుక్కుకి వేలాడదీసి ఆత్మహత్య చేసుకుందంటూ కొత్త డ్రామాకు తెరతీశాడు. అమ్మ ఆత్మహత్య చేసుకుందని చెప్పాలని కన్నబిడ్డలను హెచ్చరించాడు.. లేకుంటే చంపేస్తానని బెదిరించాడు. Also Read: అనంతరం పక్క క్వార్టర్స్‌లో ఉంటున్న ఏఎస్సైకి తన భార్య ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. ఈలోగా పిల్లలు అమ్మ ఉరేసుకుని చనిపోయిందని అమ్మమ్మ రాధకి ఫోన్ చేశారు. వెంటనే ఇంటికి చేరుకున్న భవాని తల్లి రాధకి పిల్లలు అసలు విషయం చెప్పడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. అమ్మను చంపేసి ఆత్మహత్య అని చెప్పాలని నాన్న బెదిరించాడని పిల్లలు చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Read Also:


By November 08, 2020 at 10:03AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-cop-killed-by-husband-in-visakhapatnam/articleshow/79108605.cms

No comments