Breaking News

కియారా అద్వానీకి బోల్డ్ ప్రశ్నలు.. సె** టాపిక్‌పై మొహమాట పడని యంగ్ హీరోయిన్! ఓపెన్ అయ్యిందిలా..


బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి, అట్టి అంశాల పట్ల స్పందించడానికి ఏ మాత్రం మొహమాట పడటం లేదు నేటితరం యంగ్ హీరోయిన్లు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లు అడిగిన ప్రశ్నలపై నిర్మొహమాటంగా రియాక్ట్ అవుతున్నారు. దీంతో కొందరు నటీమణులు చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ కొన్ని బోల్డ్ ప్రశ్నలపై సమాధానమిచ్చిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్‌లో స్వయం తృప్తి పొందే మహిళగా బోల్డ్ క్యారెక్టర్ చేసిన కియారా అద్వానీ.. నిజ జీవితంలోనూ అంతే బోల్డ్‌గా ఉంటానని నిరూపించింది. తాజాగా జరిగిన ఓ చిట్ చాట్ కార్యక్రమంలో.. మీకు సెక్స్ కంటే ఇష్టమైన మూడు విషయాల గురించి చెప్పండని ఓ నెటిజన్ వేసిన ప్రశ్నపై ఏ మాత్రం తడుముకోకుండా తనకు ఇష్టమైన వాటి గురించి వివరణ ఇచ్చింది కియారా. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. Also Read: సెక్స్ కంటే తనకు పిజ్జా, షాపింగ్, సినిమాలు చూడడం చాలా ఇష్టమంటూ తెలివిగా సమాధానం చెప్పింది కియారా అద్వానీ. 'లక్ష్మీ' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. మొదట 'లక్ష్మి బాంబ్' అని పేరు పెట్టిన ఈ సినిమాకు కొన్ని అభ్యంతరాలు ఎదురుకావడంతో 'లక్ష్మీ'గా పేరు మార్చారు. తెలుగులో వచ్చిన 'కాంచన' సినిమాను దర్శకుడు రాఘవ లారెన్స్ హిందీలో లక్ష్మీగా తెరకెక్కిస్తున్నారు. అక్షయ్ కుమార్, కియారా జంటగా నటించిన ఈ సినిమాను ఈ నెల 9వ తేదీన ఓటీటీ వేదిక డిస్ని ప్లస్ హాట్ స్టార్‌లో విడుడల చేస్తున్నారు.


By November 08, 2020 at 10:03AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/heroine-kiara-advani-answered-a-bold-question-in-online-chat/articleshow/79108581.cms

No comments