Sri reddy: సెక్సీ ఫొటోలతో సమంత వ్యాపారం చేస్తోంది.. పెళ్లయ్యాక కూడా ఆమె.. బాబోయ్ ఎంత మాట..!!
ఒకానొక సమయంలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ సంచలనం సృష్టించిన .. ఆ తర్వాత చెన్నైలో మకాం వేసి అవకాశం చిక్కినప్పుడల్లా బడా దర్శక నిర్మాతలు, నటీనటుల వ్యవహారాలపై కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. బడా బాబుల చీకటి కోణాలపై రియాక్ట్ అవుతూ ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేస్తూ వస్తోంది సంచలన తార శ్రీ రెడ్డి. ఈ క్రమంలోనే తాజాగా స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు బికినీ లుక్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో బూతులతో వీరంగం సృష్టించడం శ్రీ రెడ్డికి కొత్తేమీ కాదు. సెక్సీ ఫోటోలు, హాట్ కామెంట్స్ చేస్తూ ప్రతి క్షణం తన సోషల్ మీడియా అకౌంట్స్‌ని ట్రెండింగ్‌లో ఉంచుకునే శ్రీ రెడ్డి.. తాజాగా సమంతను టార్గెట్ చేయడం సినీ వర్గాల్లో హాట్ ఇష్యూగా మారింది. ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న సమంత, ఇటీవల బాత్‌టబ్ జలకాలాడుతూ హాట్ పోజిచ్చిన తన బికినీ లుక్ షేర్ చేసింది. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇదే ఫోటోను తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన శ్రీ రెడ్డి.. అర్థనగ్న ఫొటోలతో సమంత వ్యాపారం చేస్తోందంటూ ఆమెపై ఆటం బాంబ్ వేసింది. Also Read: ''గాయ్స్.. ఓ సారి ఈ ఫోటోను పూర్తిగా చూడండి. సమంతకు పెళ్లయింది.. ఆమెకు 100 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉంది. అయినా కూడా తన అందాలను ఆరబోస్తూ ఇలా ఎందుకు వ్యాపారం చేస్తుందో!'' అంటూ అక్కినేని కోడలిపై సెన్సషనల్ కామెంట్ వదిలింది శ్రీ రెడ్డి. గతంలో కూడా ఇలాగే సమంత బాడీ పార్ట్స్‌పై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె వ్యవహారం టాలీవుడ్ వీధుల్లో మరోసారి చర్చల్లో నిలిచింది. శ్రీ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు చూసి సామ్ అభిమానులు తెగ ఫీలై పోతున్నారు. చూడాలి మరి ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుందనేది.
By November 29, 2020 at 01:43PM
No comments