విషాదం.. లిఫ్ట్ మధ్యలో నగిలిపోయి ఐదేళ్ల బాలుడు మృతి
ఐదేళ్ల బాలుడు లిఫ్ట్ గ్రిల్స్ మధ్య నగిలిపోయి మృతి చెందిన విషాదకర ఘటన ముంబయిలోని ధారవీలో చోటుచేసుకుంది. కోజీ షెల్టర్ భవనంలో తన సోదరిలతో కలిసి కింది అంతస్తు నుంచి నాలుగో అంతస్తుకు వెళ్లేందుకు బాలుడు లిఫ్ట్ ఎక్కగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ లిఫ్టుకు గ్రిల్స్‌తోపాటు దాని వెనుక డోర్ కూడా ఉందని అధికారులు తెలిపారు. గ్రిల్స్‌తో పాటు తలుపు మూసుకుంటే ఆ లిఫ్టు కదులుతుందని వివరించారు. బాలుడు మహమ్మద్ హుజైఫ్ సర్ఫరాజ్ షేక్ లిఫ్టులో కింది అంతస్తుకు చేరుకోగానే ముందు అక్కాచెల్లెల్లు ఇద్దరూ గ్రిల్స్, డోర్ తీసుకుని బయటకు వచ్చారు. అయితే, చివరలో లిఫ్టులో నుంచి బయటకు వచ్చిన సర్ఫరాజ్ గ్రిల్స్ మూసివేస్తున్న క్రమంలోనే వెనుక ఉన్న తలుపు మూసుకుపోయింది. దీంతో దాని మధ్యలోనే ఉండిపోయిన ఆ చిన్నారికి అక్కడి నుంచి ఎలా బయటకు వెళ్లాలో తెలియలేదు. ఇదే సమయంలో మరొకరు లిఫ్ట్ బటన్ నొక్కడంతో అది కిందకు కదిలింది. దీంతో గ్రిల్స్ మధ్యలోనే బాలుడు చిక్కుకుని మృతి చెందాడు.. ఈ ఘటన అక్కడి సీసీ టీవీలో రికార్డయింది. శనివారం మధ్యాహ్నం 12.43 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహమ్మద్ హుజైఫ్ సర్ఫరాజ్ షేక్ తన అక్క, చెల్లితో కలిసి నాలుగో అంతస్తులోని తమ ప్లాట్‌కు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కాడు. ముందు సోదరిలు దిగిపోగా.. హుజైఫ్ అందులోనే ఉండిపోయాడు. లిఫ్ట్‌కు ఉండే చెక్క తలుపు మూసుకుపోవడం, ఇంతలో మరో ఫ్లోర్‌లో లిఫ్ట్ బటన్ నొక్కడంతో కిందికు వెళ్లిపోయింది. దీంతో అతడు గోడల మధ్య నలిగిపోయి కింద పడిపోయాడు. హుజైఫ్ గురించి తల్లి అడగటంతో అతడు లిఫ్ట్‌లోనే ఉండిపోయాడని ఆ చిన్నారులు చెప్పారు. దీంతో తల్లి కంగారుగా అక్కడకు వచ్చి చూసేసరికి బాలుడు కనిపించలేదు. నాలుగు, ఐదో అంతస్తు గోడలకు రక్తపు మరకలు ఉండటాన్ని గమనించిన అపార్ట్‌మెంట్ వాసులు కిందకు వెళ్లి చూడగా అక్కడ అచేతనంగా పడి ఉన్నాడు. తీవ్ర గాయాలతో ఉన్న బాలుడ్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
By November 29, 2020 at 01:56PM
No comments