Shruti Haasan: పవన్ కళ్యాణ్ రీ- ఎంట్రీపై శృతి హాసన్ కామెంట్.. అసలు విషయం బయటపెట్టిన బ్యూటీ
రెండేళ్ల రాజకీయ ప్రయాణం చేసిన .. తిరిగి సినిమాతో వెండితెరపై రీ- ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన 'పింక్' సినిమాకు రీమేక్‌గా వకీల్ సాబ్ రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఇందులో పవన్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తుండగా, సినిమాను మలుపుతిప్పే పాత్ర కోసం నాలుగో హీరోయిన్‌గా శృతి హాసన్‌ని కన్ఫామ్ చేశారనే వార్తలు విన్నాం. తాజాగా వాటిని నిజం చేస్తూ తాను వకీల్ సాబ్ సెట్స్ పైకి రాబోతున్నానని తెలిపింది . వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న వకీల్ సాబ్ చిత్రానికి బోనీకపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో నాలుగో హీరోయిన్‌కి కూడా స్కోప్ ఉండటంతో శృతి హాసన్‌ని ఫైనల్ చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవలే 'అవును.. నేను వకీల్‌సాబ్ మూవీ నటిస్తున్నాను. ఆ సినిమాలో నా పాత్ర ఏంటనేది ఇప్పుడే చెప్పలేను' అంటూ ఓపెన్ అయిన శృతి.. తాజాగా మరోసారి వకీల్ సాబ్ అప్‌డేట్ ఇస్తూ పవన్ కళ్యాణ్ రీ- ఎంట్రీ గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. Also Read: ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో టచ్‌లోకి వచ్చిన శృతి హాసన్.. పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రావడం చాలా సంతోషంగా అనిపిస్తోందని, ఆ సినిమాలో తానూ భాగమవుతుండటం అంతకు రెట్టింపు సంతోషాన్నిస్తోందని చెప్పింది. జనవరి నుంచి `వకీల్ సాబ్` షూటింగ్‌కి హాజరు కాబోతున్నానని తెలిపింది. పవన్‌తో మూడోసారి పనిచేస్తున్నా వెరీ హ్యాపీ అని పేర్కొంటూ మెగా అభిమానుల్లో జోష్ నింపింది. అయితే శృతి ఇచ్చిన ఈ అప్‌డేట్‌తో వకీల్ సాబ్ సినిమా సంక్రాంతి బరిలో ఉండదనే విషయం కన్ఫామ్ అయిందనే చెప్పుకోవాలి. వకీల్ సాబ్ మూవీలో పవన్ కళ్యాణ్ న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో పవన్‌కి భార్యగా శృతి హాసన్ కనిపించనుందని సమాచారం.
By November 26, 2020 at 06:59AM
No comments