Breaking News

ఈ స్టార్‌ హీరోయిన్‌ను భర్త చిత్రహింసలు పెట్టేవాడట..


పాత తరంలో హీరోయిన్లలో ఓ వెలుగు వెలిగిన వారిలో ఒకరు. ఆమె పేరు వింటే మనకు గుర్తొచ్చే సినిమా ‘గోరింటాకు’. 1952 డిసెంబర్ 10న జన్మించిన సుజాత 14వ ఏటే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సుజాత తండ్రి ఉద్యోగరీత్యా శ్రీలంకలోని గాలే పట్టణంలో పని చేసేవారు. దీంతో సుజాత శ్రీలంకలోనే పుట్టి పెరిగారు. తండ్రి రిటైర్ అయ్యాక కుటుంబంతో కలిసి చెన్నైకి వచ్చి స్థిరపడ్డారు. 1974 సంవత్సరంలో కె.బాలచందర్ డైరెక్షన్లో ‘ అవ్వాలోరు తుధల్ కథై’ సినిమాతో పరిచయమైన సుజాత ఆ సినిమా హిట్ అవడంతో తమిళంలో స్టార్ హీరోలు ఆయన రజనీకాంత్, కమల్ హాసన్, జెమిని గణేశణ్‌ లాంటి హీరోలతో కలిసి నటించారు. ‘గోరింటాకు’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అచ్చం తెలుగు అమ్మాయిలా కనిపించే సుజాత.. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించారు. Also Read: సుజాత తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కలిసి సుమారు 300కి పైగా సినిమాల్లో నటించారు. ఆమె ఆఖరి సినిమా ‘శ్రీరామదాసు’. హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఇంటి యజమాని కొడుకు జయకర్‌తో ప్రేమలో పడి అతడినే పెళ్లి చేసుకుంది. వీరికి ఓ అమ్మాయి, అబ్బాయి సంతానం. ఆ తర్వాత సినిమాలకు స్వస్తి పలికిన సుజాత కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడి వాతావరణం పడకపోవడంతో తిరిగి ఇండియాకు వచ్చేసి మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. అయితే సినిమాల్లో అగ్ర హీరోలతో నటించిన మెప్పించిన సుజాత వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా కష్టాలు పడ్డారట. సుజాత భర్త జయకర్ ఓ పనీ చేయకుండా ఇంట్లోనే ఉంటూ ఆమెను నానా కష్టాలు పెట్టేవాడట. ఒక్కోసారి షూటింగ్ నుంచి ఇంటికి రాగానే కావాలనే గొడవ పెట్టుకుని బెల్టుతో తీవ్రంగా కొట్టేవాడని అప్పట్లో చెప్పుకునేవారు. అంతేకాదు కొన్నిసార్లు షూటింగ్స్ స్పాట్‌కే వచ్చి ఆమెపై చేయి చేసుకునేవాడట. ఎవరైనా దర్శక నిర్మాతలు సినిమా చేయాలని ఆమెను అడగడానికి వస్తే వారికి దిమ్మతిరిగేలా కండిషన్స్ పెట్టి ఛాన్సులు పోగొట్టేవాడట. సినిమాల్లో ఎన్నో కన్నీటి పాత్రలను పోషించిన సుజాత భర్త కారణంగా నిజ జీవితంలో అంతకంటే ఎక్కువ కష్టాలు పడటం నిజంగా బాధాకరం. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గడంతో తల్లి, వదిన, అక్క లాంటి పాత్రలు పోషించడం మొదలుపెట్టారు సుజాత. గోరింటాకు, సూత్రధారులు, సర్కస్ రాముడు, సూరిగాడు, వంశ గౌరవం, బహుదూరపు బాటసారి, ఎమ్మెల్యే ఏడుకొండలు, చంటి, పెళ్లి లాంటి సినిమాలు ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. కోడి రామకృష్ణ డైరెక్షన్లో 1997లో వచ్చిన ‘పెళ్లి’ సినిమాకు గాను ఆమె నంది అవార్డు అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఆమెకు ‘కళైమామణి’ అవార్డుతో సత్కరించింది. 2006లో వచ్చిన ‘శ్రీరామదాసు’ ఆమె చివరి సినిమా. ఆ తర్వాత అనారోగ్యానికి గురైన సుజాత ఇంటికే పరిమితమయ్యారు. చివరికి 2011, ఏప్రిల్ 6వ తేదీ చెన్నైలోని తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు.


By November 25, 2020 at 01:01PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/veteran-actress-sujatha-tragedy-incidents-in-personal-life/articleshow/79404095.cms

No comments