Breaking News

తీరం దాటి తీవ్ర తుఫానుగా మారిన నివర్.. అయినా పొంచి ఉన్న ముప్పు


నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తమిళనాడు, పుదుచ్చేరిల మధ్య గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు తీరం దాటింది. బుధవారం సాయంత్రం పెను తుఫానుగా మారిన నివర్.. తీరం దాటిన తర్వాత తీవ్ర తుఫానుగా మారింది. బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల మధ్య నివర్‌ తుపాను తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. నివర్ ప్రభావంతో ఇప్పటికే తమిళనాడులోని పలు జిల్లాలు, ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వాతావరణ శాఖ అంచనా వేసినట్టుగానే తుఫాను తీరం దాటిన తర్వాత గంటకు 120-145 కి.మీల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. రాబోయే మూడు గంటటల్లో ఈ గాలుల తీవత్ర 65-75 కిలోమీటర్ల వేగానికి తగ్గుతుందని పేర్కొంది. అయితే, ముప్పు ఇంకా తప్పిపోలేదని, తుఫాను కొంత భాగం సుముద్రంలోనే ఉందని, దీని కేంద్రం భూమిపై ఉందని హెచ్చరించింది. మరోవైపు, చెన్నై సముద్ర తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. నివర్‌ తుఫాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకు చెన్నై నగరం నీటమునిగింది. ప్రస్తుతం వాయువ్య దిశగా పయనిస్తోన్న నివర్.. పుదుచ్చేరికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో లక్ష మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ ఎస్ఎన్‌ ప్రధాన్‌ వెల్లడించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం 50 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కేటాయించినట్టు తెలిపారు. వీటిలో 30 బృందాలను తమిళనాడు, ఏపీతో పాటు పుదుచ్చేరిలో మోహరించామన్నారు. పరిస్థితులను బట్టి అవసరమైతే మరో 20 బృందాలను విజయవాడ, కటక్‌, త్రిస్సూర్‌లకు పంపేందుకు సిద్ధంగా ఉంచినట్టు ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ పేర్కొన్నారు. ఇటు ఏపీలో చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగతా చోట్ల అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు ఉన్నాయి. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు సహాయక చర్యల కోసం 5ఎస్డీఆర్‌ఎప్‌, 4ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకున్నాయి. ఇల్లు సురక్షితం కాకపోతే పునరావాస కేంద్రాలకు ప్రజలు తరలివెళ్లాలని విపత్తల శాఖ సూచించింది. రైతులు అప్రమత్తంగా ఉండి, పంట సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.


By November 26, 2020 at 06:30AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/nivar-crosses-coast-near-puducherry-weakens-into-severe-cyclonic-storm/articleshow/79419115.cms

No comments