Breaking News

RRR: ఎవ్వరూ తప్పించుకోలేరు.. వణికిపోతున్న రాజమౌళి టీమ్..!


కరోనా కారణంగా దాదాపు ఎనిమిది నెలలపాటు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చిన యూనిట్.. ఇటీవలే తిరిగి సెట్స్ మీదకు వచ్చింది. చిత్రంలోని కీలక ఘట్టాలను తెరకెక్కించడంలో బిజీ అయ్యారు . చాలా స్ట్రిక్ట్‌‌‌గా యూనిట్ అందరితో కలిసి షూటింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా లొకేషన్స్‌పై తీసిన ఓ చిన్న వీడియోను షేర్ చేసింది RRR టీమ్. ఇందులో యూనిట్ అంతా చలికి వణికిపోతూ కనిపిస్తుండటం చూస్తుంటే ఈ షూటింగ్‌పై వారంతా ఎంత శ్రద్ద పెట్టారనేది స్పష్టమవుతోంది. 'సెట్ హీటర్స్ లేకుండా ఈ చలి గాలుల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు' అని పేర్కొంటూ లొకేషన్స్‌ వద్ద ఉన్న పరిస్థితులను వీడియో రూపంలో ప్రేక్షకుల ముందుంచారు మేకర్స్. ఈ వీడియోలో యూనిట్ సభ్యులు మొత్తం చలిలో వణుకుతూ షూట్‌లో పాల్గొంటున్నట్లు కనిపిస్తోంది. రాజమౌళి, ఎన్టీఆర్, కెమెరామెన్ సెంథిల్ కుమార్.. ఇలా అందరూ సెట్‌లో ఏర్పాటు చేసిన హీటర్స్ దగ్గర చలి కాచుకుంటూ కనిపిస్తున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా షూటింగ్ ఫినిష్ చేయాలనే దృఢ సంకల్పంతో టీమ్ పని చేస్తున్నట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. Also Read: డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్ కనిపించనున్నారు. కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవగన్, శ్రీయ, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


By November 17, 2020 at 11:56AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rrr-team-shared-shootings-locations-video/articleshow/79257652.cms

No comments