Breaking News

బరిలోకి దిగుతున్న మెగాస్టార్.. 20 నుంచి నాన్‌స్టాప్ కుమ్ముడే


మెగాస్టార్‌ మళ్లీ మేకప్ వేసుకునేందుకు సిద్దమైపోతున్నారు. దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘’ కోసం ఆయన బరిలోకి దిగనున్నారు. ఈ నెల 20 నుంచి చిరంజీవి, డిసెంబర్ 5వ తేదీ నుంచి హీరోయిన్ కాజల్ అగర్వాల్ షూటింగ్‌కు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇతర తారాగణంతో ‘ఆచార్య’ షూటింగ్ ఇప్పటికే జరుగుతోంది. చిరంజీవికి కరోనా పాజిటివ్ రావడం, ఆ తర్వాత చేసిన మూడు టెస్టుల్లో నెగిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ గందరగోళం మధ్య ఆయన కొద్దిరోజులుగా ఇంట్లోనే ఉంటున్నారు. ఆరోగ్యం పూర్తి స్పష్టత రావడంతో ఇక షూటింగులో పాల్గొనాలని చిరంజీవి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆచార్యలో మెగాస్టార్ తనయుడు కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ‘ఆర్ఆర్ఆర్’ షూటింగులో బిజీగా ఉన్నారు. అయితే కరోనా పాజిటివ్ వచ్చిన చిరంజీవి 14రోజులు క్వారంటైన్లో ఉండాలని వైద్య,ఆరోగ్య శాఖ ఆయన్ని హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై చిరంజీవి గానీ, వైద్యాధికారులు గానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో అది కేవలం రూమర్‌గానే మిలిగిపోయింది. Also Read:


By November 18, 2020 at 07:22AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mega-star-chiranjeevi-will-joins-on-20th-november-in-acharya-shooting/articleshow/79273774.cms

No comments