Breaking News

ఒకే ఇంట్లో ఐదురుగు మిస్సింగ్.. నెల్లూరులో కలకలం


ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కనిపించకుండా పోవడం జిల్లాలో కలకలం రేపుతోంది. ఇద్దరు మహిళలు సహా ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. ఆస్పత్రికి వెళ్లి వస్తామని పిల్లలతో సహా బయలుదేరిన తోడికోడళ్లు కనిపించకుండా పోయారు. జిల్లాలోని మండలం లో ఈ ఘటన జరిగింది. జీకే పల్లి నుంచి వెంకటగిరి ఆస్పత్రికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన మహిళలు, చిన్నారులు మధ్యాహ్నం నుంచి అదృశ్యమైనట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం 1 గంట నుంచి వారి ఆచూకీ దొరకలేదు. కనిపించకుండా పోయిన వారి కోసం పోలీసులు, గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆస్పత్రికి బయలుదేరిన మహిళలు ఎక్కడికి వెళ్లి ఉంటారు? పిల్లలతో సహా వెళ్లిపోవాల్సిన కారణమేంటి? అనే దిశగా ఆరా తీస్తున్నారు. Also Read:


By November 17, 2020 at 11:08AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/two-women-three-children-missing-in-nellore-district/articleshow/79257006.cms

No comments